మరోవైపు బుధవారం ఎపిసోడ్‌లో బిగ్‌బాస్5 ఎపిసోడ్ ఆద్యంతం సందడిగా, ఫన్నీగా సాగింది. హమీద, సిరిలతో శ్రీరామ్ సన్నివేశాలు, కాజల్, ప్రియాంకలతో సన్నీ చేసిన రొమాంటిక్ సన్నివేశాలు కడుపుబ్బ నవ్వించాయి. మరోవైపు మానస్, లహరి మధ్య సన్నివేశారు, షణ్ముఖ్, స్వేత వర్మ, లోబోల మధ్య సన్నివేశాలు సైతం నవ్వులు పూయించాయి.