Bigg Boss Telugu 7 finale : 15 లక్షల ఆఫర్ కి టెంప్ట్ అయిన యావర్? ప్రియాంకని ఎలిమినేట్ చేసిన రవితేజ.!?

Published : Dec 16, 2023, 07:44 PM ISTUpdated : Dec 16, 2023, 07:49 PM IST

Bigg Boss Telugu 7 Grand Finale  కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతున్నాయి. మరో ఇద్దరు టైటిల్ రేసు నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. 

PREV
16
Bigg Boss Telugu 7 finale :  15 లక్షల ఆఫర్ కి టెంప్ట్ అయిన యావర్? ప్రియాంకని ఎలిమినేట్ చేసిన రవితేజ.!?

బిగ్ బాస్ తెలుగు 7 (Bigg Boss Telugu) గ్రాండ్ ఫినాలే నుంచి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్నారు. తాజాగా ప్రియాంక కూడా ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది. అలాగే యావర్ కూడా టైటిల్ రేసు లో నుంచి తప్పుకున్నారని సమాచారం. 

26

ఏడో సీజన్ చాలా ఆసక్తికరంగా కొనసాగింది. ఆరు సీజన్లతో పోల్చితే ఈ సీజన్ ఆడియెన్స్ కు మంచి కిక్కు ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఆదివారంతో షో ముగియనుంది. అదే రోజు టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు నాగార్జున.

36

అయితే,  ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే కు సంబంధించిన షూట్ పూర్తైందని తెలుస్తోంది. దీంతో కొన్ని లీక్స్ అందుతున్నాయి. ముగ్గురు ఇంటి నుంచి వెళ్లిపోయాగా.. మరో ముగ్గురు మాత్రమే టైటిల్ రేసులో ఉన్నారని తెలుస్తోంది. 

46

ఇప్పటికే టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన అర్జున్ అంబటి (Arjun Ambati)  ఓటింగ్ ఆర్డర్ ద్వారా ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా అందిన సమాచారం మేరకు ప్రియాంకను (Priyanka) గ్రాండ్ ఫినాలేకి హాజరైన మాస్ మహారాజా (Ravi Teja) ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. 

56

ఇక ప్రిన్స్ యావర్ టైటిల్ రేసు నిలిచేందుకు ఆసక్తి చూపలేదు. అక్కినేని నాగార్జున ఇచ్చిన రూ.15 లక్షల ఆఫర్ కు టెంప్ట్ అయ్యాడని సమాచారం. డబ్బులున్న సూట్ కేస్ ను తీసుకొని హౌజ్ నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. 

66

దీంతో ప్రస్తుతం హౌజ్ లో కేవలం ముగ్గురి మధ్యనే టైటిల్ పోరు కొనసాగుతుంది. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ హౌజ్ లో ఉంటారు. వీరిలో టైటిల్ విన్నర్ ఎవరనేది రివీల్ కాకుండా నాగార్జున చాలా జాగ్రత్త పడుతున్నారు. ఆదివారం ప్రసారం కానున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో విజేతను ప్రకటించనున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories