Kajal Aggarwal : కూకట్ పల్లిలో కాజల్ అగర్వాల్ సందడి... చీరకట్టులో స్టార్ హీరోయిన్ లుక్ వైరల్.. ఫొటోలు

First Published | Dec 16, 2023, 5:30 PM IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా కూకట్ పల్లిలో సందడి చేసింది. ఓ షో రూమ్ ఓపెనింగ్ సందర్భంగా విచ్చేసిన చందమామకు అభిమానులు గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) చివరిగా బాలయ్య సరసన ‘భగవంత్ కేసరి’ సరసన నటించింది. పెళ్లి, కొడుకుకు జన్మినిచ్చిన తర్వాత ఈ చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిగ్ స్క్రీన్ పై మెరిసి తన అభిమానులను ఖుషీ చేసింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది.
 

ఈ క్రమంలో ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు షోరూమ్ ల ప్రారంభోత్సవాలకు కూడా వెళ్తోంది కాజల్. తన అందమైన లుక్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో సందడి చేసింది. కాజల్ రాకతో అభిమానులు తరలివచ్చారు. 


కూకట్ పల్లిలోని పీఎన్ఆర్ ఫస్ట్ ఫ్లోర్ లో దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమాండ్స్ షోరూం ను కాజల్ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ వందలకొద్దీ అక్కడికి చేరుకున్నారు. ప్రారంభోత్సవానికి ముందుకు అభిమానులను పలకరించింది కాజల్. తనకు అందించిన బొకేను ఫ్యాన్స్ కు బహుమతిగా ఇచ్చింది.

షోరూమ్ ప్రారంభోత్సవానికి హాజరైన కాజల్ చీరకట్టులో ఆకట్టుకుంది. ట్రాన్స్ ఫరెంట్ శారీ, మ్యాచింగ్ బ్లౌజ్, ఆకట్టుకునే జ్యూయెల్లరీలో మెరిసిపోయింది. తన అందానికి మరింత మెరుపులు దిద్ది అభిమానులకు దర్శనమిచ్చింది. ఫ్యాన్స్ ప్రస్తుతం కాజల్ లేటెస్ట్ లుక్ కు సంబ:ధించి ఫొటోలు, వీడియోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ... దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షోరూం బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ షోరూంలో ఏర్పాటు చేసిన బ్రెయిడల్ కలెక్షన్స్ చాలా అద్భుతం గా ఉన్నాయి. హైదరాబాద్ లోని మహిళలు ఒక్కసారైనా కలెక్షన్స్ ను చూడాలని సూచించింది. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ తమ ఫోరూమ్ ప్రత్యేకతలను వివరించారు. 

విక్టోరియన్ కలెక్షన్స్, పోల్కి డైమండ్స్, నగిషీ, కుందన బ్రైడల్ జ్యుయలరీ అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గానే ‘భగవంత్ కేసరి’తో అలరించింది. ప్రస్తుతం ‘సత్యభామ’, ‘ఉమా’, ‘ఇండియన్ 2’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. 

Latest Videos

click me!