Prince Twitter Review:`ప్రిన్స్` మూవీ ట్విట్టర్ టాక్‌.. `జాతిరత్నం` మరోసారి రచ్చ చేశాడా?

First Published | Oct 21, 2022, 7:15 AM IST

`జాతిరత్నాలు` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న అనుదీప్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ప్రిన్స్`. శివకార్తికేయన్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ నటించిన ఈ చిత్రం నేడు(శుక్రవారం) అక్టోబర్‌ 21న విడుదలైంది. విదేశాల్లో ముందుగా ప్రదర్శించబడిన ఈ చిత్రానికి సంబంధించి టాక్‌ బయటకు వచ్చింది. నెటిజన్లు ట్విట్టర్‌లో పోస్టుల రూపంలో రివ్యూ చెబుతున్నారు. మరి ఆ ట్విట్టర్‌ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. 

తెలుగులో ఇటీవల వచ్చిన `జాతిరత్నాలు` (Jathi Ratnalu) చిత్రం ఎంత విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఫ్యూర్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమా టాలీవుడ్‌లో ఓ సంచలనంగా నిలిచింది. ఈసినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యారు దర్శకుడు అనుదీప్‌(Anudeep). ఆయన అమాయకత్వపు ప్రవర్తనే `జాతిరత్నం`లో కనిపిస్తుంది. అందుకే సినిమాతోపాటు అనుదీప్‌ కూడా పాపులర్‌ అయిపోయారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తోన్న చిత్రం `ప్రిన్స్`(Prince). `రెమో`, `డాక్టర్‌`, `డాన్‌` వంటి చిత్రాలతో తెలుగులోమార్కెట్ ఏర్పర్చుకుంటూ వచ్చిన శివ కార్తికేయన్‌(Shiva Karthikeyan) హీరోగా ఈ `ప్రిన్స్‌` చిత్రాన్ని బైలింగ్వల్‌గా రూపొందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా శుక్రవారం(అక్టోబర్‌ 21)న విడుదలైంది. ఓ వైపు తమిళంలో `సర్దార్‌`తో, ఇటు తెలుగులో `ఓరిదేవుడా`,`జిన్నా` చిత్రాలతో పోటీ పడుతూ విడుదలవుతుంది. మరి సినిమాకి సంబంధించి ఇతరదేశాల్లో ప్రీమియర్స్ పడ్డాయి. ఆ టాక్‌ ఎలా ఉందనేది నెటిజన్లు ట్విట్టర్లలో తెలియజేస్తున్నారు. ట్విట్టర్‌ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం.  (Prince Twitter Review)

స్కూల్‌ టీచర్‌గా పనిచేసే శివ కార్తికేయన్‌, అదే స్కూల్‌లో ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేస్తున్న బ్రిటీష్‌ అమ్మాయి మెరియా రేబోషప్కా ని ప్రేమిస్తాడు. ఆమె ప్రేమను పొందేందుకు చాలా ప్రయత్నిస్తాడు. అయితే ఆమెని పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో,ఊర్లో జనాన్ని ఒప్పించేందుకు నానా కష్టాలు పడ్డాల్సి వస్తుంది. `ఆల్‌ ఇండియన్స్ ఆర్‌ మై బ్రదర్స్ అండ్‌ సిస్టర్స్ అనుకున్నాను కాబటే ఇతర దేశాల అమ్మాయిని ప్రేమించా` అంటూ ఆయన చెప్పడం ఇందులో హైలైట్. మరి ఆమెని పెళ్లి చేసుకునేందుకు ఎలాంటి స్ట్రగుల్ పడ్డాడు. చివరికిఎలా గెలిచాడనేది ఇందులో ఆసక్తికరం.  (Prince Twitter Review)

Latest Videos


`జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్‌ రూపొందించిన సినిమా కావడం, పైగా శివకార్తికేయన్‌ నటించడంతో సినిమాపై అంచనాలున్నాయి. అనుదీప్‌ అంటే కామెడీ. ఈ చిత్రాన్ని కూడా కామెడీ ఎంటర్‌టైనర్‌గా మలిచినట్టు సినిమా చూసిన నెటిజన్ల పోస్ట్ లను బట్టి తెలుస్తుంది. కామెడీ సీన్లు బాగానే వర్కౌట్‌ అయినట్టు చెబుతున్నారు.   (Prince Movie Twitter Review)

ఫస్టాఫ్‌ ఆద్యంతం కామెడీగా సాగిందట. క్లీన్‌గా ఉందని టాక్‌. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేసేలా ఉందని, దీపావళి పండక్కి బాగా ఎంజాయ్‌ చేసే చిత్రమవుతుందని చెబుతున్నారు. శివ కార్తికేయ, సత్యరాజ్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయట. మొదటి భాగం లైట్ హార్టెడ్ గా ఉందని, ఓ సారి చూసేలా ఉందట.  (Prince Movie Twitter Review)

శివ కార్తికేయన్‌ ఎప్పటిలాగే బాగాచేశాడట. అలాగే మేరియా నటన బాగుందని, ఆమె మరింత అందంగా కనిపించిందట. థమన్‌ సంగీతం సినిమాకి ప్లన్‌, బీజీఎం సైతం అసెట్‌గా నిలుస్తుందంటున్నారు. విజువల్‌గా బాగుందంటున్నారు. హీరో సినిమా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారని, ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తే ఓపెనింగ్స్ బాగుంటాయని అంటున్నారు.

దీంతోపాటు కొన్ని నెగటివ్‌ టాక్‌ కూడా వస్తున్నాయి. జాతిరత్నం దెబ్బేశాడని, ఆ సినిమా స్థాయిలో లేదంటున్నారు. కామెడీ కొన్ని చోట్లనే వర్కౌట్‌ అయ్యిందని టాక్‌. చాలా వరకు డిజప్పాయింట్‌గా ఉందనే పోస్టులు కనిపిస్తున్నాయి. మిస్టర్ లోకల్‌ సినిమాకి సీక్వెల్గా ఉందంటున్నారు. పాత కథ అని, దీనికితోడు బలమైన కథ, బలమైన సంఘర్షణ లేదని, దీంతో కామెడీ తేలిపోయిందంటున్నారు. అన్ని కామెడీ సీన్లే ఉన్నా, పేలేది కొన్నే అని, సెకండాఫ్‌లో వినోదం తగ్గిపోయిందన్నారు. లవ్‌ స్టోరీ సన్నివేశాలు సిల్లీగా ఉన్నాయట.

ఓవరాల్‌గా యావరేజ్‌ టాక్‌ వినిపిస్తుంది. `జాతిరత్నాలు`ని దృష్టిలో పెట్టుకునే చూస్తే తేలిపోయే సినిమా అని, ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే అక్కడక్కడ ఎంజాయ్‌ చేసేలా ఉంటుందని, అంచనాలతో పోతే డిజప్పాయింట్‌ చేస్తుందని అంటున్నారు. ఇది విదేశాల్లో ఉన్న ఆడియెన్స్ అభిప్రాయం. మరి నిజంగానే సినిమా ఎలా ఉందనేది `ఏషియా నెట్‌` రివ్యూలో తెలుసుకుందాం.   (Prince Twitter Review)

click me!