తమిళంలో 2020 లో వచ్చిన 'ఓ మై కడవులే' సినిమాకు రీమేక్ గా వస్తున్న చిత్రం ఇది. తమిళ ఒరిజనల్ డైరక్ట్ చేసిన అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్, హీరోయిన్స్ గా మిథిలా పాల్కర్, ఆశా భట్ నటించారు. ఫాంటసీ, లవ్, కామెడీ జోనర్ లో రాబోతోన్న ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించటమే ఉన్నంతలో క్రేజీ ఎలిమెంట్. అలాగే రీసెంట్ గా జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కావడంతో సినిమా అందరి దృష్టిలో పడింది. తమిళంలో సూపర్ హిట్ సినిమా కావటం, వెంకటేష్ లాంటి పెద్ద హీరో స్పెషల్ రోల్ లో కనిపించటంతో సినిమా పై అంచనాలు భాగానే ఉన్నాయి. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ జంటగా నటించిన ఈసినిమాలో సీనియర్ హీరో.. వెంకటేష్ దగ్గుబాటి, గెస్ట్ రోల్ లో అలరించారు. రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ, నాగినీడు లాంటి సీనియర్ యాక్టర్స్ నటించిన . ఈ సినిమాను అశ్వత్ డైరెక్ట్ చేయగా.. PVP సినిమా & శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.