PremaDesam Review: 'ప్రేమదేశం' మూవీ రివ్యూ

First Published Feb 3, 2023, 4:21 PM IST

'ప్రేమదేశం' అనగానే 1996లో వచ్చిన అబ్బాస్, వినీత్, టబు నటించిన ఐకానిక్ లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది. ఇదే టైటిల్ తో దర్శకుడు శ్రీకాంత్ సిద్దమ్ నేటి తరానికి తగ్గట్లుగా ఒక ప్రేమ కథ చిత్రీకరించారు. ఈ ప్రేమదేశంలో యువ హీరో త్రిగున్, యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ జంటగా నటించారు.

'ప్రేమదేశం' అనగానే 1996లో వచ్చిన అబ్బాస్, వినీత్, టబు నటించిన ఐకానిక్ లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది. ఇదే టైటిల్ తో దర్శకుడు శ్రీకాంత్ సిద్దమ్ నేటి తరానికి తగ్గట్లుగా ఒక ప్రేమ కథ చిత్రీకరించారు. ఈ ప్రేమదేశంలో యువ హీరో త్రిగున్, యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ జంటగా నటించారు. అసలు ఏమాత్రం బజ్ లేకుండా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని యువ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్నారు. రఘు కళ్యాణ్ రెడ్డి, రాములు అసోసియేట్ ప్రొడ్యూసర్స్ గా,కమల్, కిరణ్, రూపా, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. అలనాటి నటి మధుబాల కీలక పాత్రలో నటించింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించే విధంగా ఉందా లేదా అనేది సమీక్షలో చూద్దాం. 

కథ :

అర్జున్ (త్రిగున్) , ఆద్య( మేఘా ఆకాష్) ఇద్దరూ కాలేజీ స్టూడెంట్స్. ఒకరిపై ఒకరికి ఇష్టం ప్రేమ ఉంటాయి. కానీ బయటపడరు. అర్జున్, ఆద్య ఇద్దరూ తమ మనసులో మాట బయట పెట్టాలని సిద్ధం అవుతారు. అప్పుడే అర్జున్ కి కారు ప్రమాదం జరుగుతుంది. ఆ కారు డ్రైవ్ చేస్తున్న అమ్మాయి మాయ. మాయకి కూడా రిషి (అజయ్ కతుర్వర్)తో ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది. 

ఇద్దరూ ప్రేమించుకున్నప్పటికీ ఆమె శివ(రామచంద్రన్) అనే వివాహం చేసుకునేందుకు రెడీ అవుతుంది. కానీ ఆమె చేసిన యాక్సిడెంట్ కారణంగా అర్జున్, ఆద్య జీవితాలు తలక్రిందులు అవుతాయి. కానీ ఆ రెండు పార్లర్ లవ్ స్టోరీలు ఒక దగ్గర కనెక్ట్ అయి ఉంటాయి. ఆ అంశం ఏంటి ? అర్జున్ ఆద్య ప్రేమకి.. మాయ, రిషి లకు ఉన్న సంబంధం ఏంటి ? అర్జున్ ఆద్య ప్రేమ కథ సుఖాంతం అయ్యిందా అని తెలుసుకోవడమే మిగిలిన కథ. 

విశ్లేషణ :

దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ప్రేమదేశం చిత్రం క్లాసిక్ గా నిలిచింది. అదే టైటిల్ తో ఇప్పుడు సినిమా చేస్తే అంచనాలు తప్పఁకుండా ఉంటాయి. శ్రీకాంత్ సిద్ధమ్ తెరకెక్కించిన ఈ ప్రేమదేశం పై ఎలాంటి అంచనాలు లేవు. కానీ సినిమా చూడడానికి వెళ్లేవారు తప్పకుండా ఆ ప్రేమదేశంతో పోల్చిచూస్తారు. దర్శకుడు శ్రీకాంత్ రెండు ప్రేమకథలు రాసుకుని దానికి ఒక కామన్ థ్రెడ్ పెట్టారు. 

ఇది మనం చాలా చిత్రాల్లో చూసిన జిమ్మిక్కే. త్రిగున్ ,మేఘా ఆకాష్ మధ్య దర్శకుడు సృష్టించిన రొమాంటిక్ సీన్స్ ఈ చిత్రానికే హైలైట్ అని చెప్పాలి. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంటుంది. మేఘా ఆకాష్ అందంగా కనిపిస్తూ తన లుక్స్ తో ఆకట్టుకుంది. త్రిగున్ చలాకీగా ఉండే ప్రేమికుడిగా మెప్పించాడు. అతని కామెడీ టైమింగ్ కూడా చాలా సన్నివేశాల్లో పేలింది. 

మరోవైపు అజయ్ కతుర్వర్, మాయ ప్రేమ కథ సాగుతుంది. అయితే వీరి లవ్ స్టోరీ లో సన్నివేశాలు రొటీన్ గా ఉంటాయి. కానీ అజయ్ తన పెర్ఫామెన్స్ తో మెప్పించే ప్రయత్నం చేశాడు. మాయ కూడా బాగానే నటించింది. తనికెళ్ళ భరణి తాను కనిపించినంత మెప్పించారు. అయితే ఆయన నటనకి తగ్గ సీన్స్ పడలేదు. హీరో తల్లిగా అలనాటి నటి మధుబాల కట్టుకుంది. 

ఒక మాస్ చిత్రంలో చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి. కానీ ప్రేమ కథకి మాత్రం దర్శకుడు స్టోరీని ఎలా నడిపిస్తున్నాడు అనేదే కీలకం. ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు ప్రజెంట్, పాస్ట్ చూపిస్తూ చేసిన స్క్రీన్ ప్లే మ్యాజిక్ కొంతవరకు ఆకట్టుకుంది. కాయాన్ని కథ మొత్తం ఒకేలా సాగడంతో ప్రిడిక్టబుల్ గా అయిపోయింది.  

టెక్నికల్ గా :

మణిశర్మ అందించిన పాటలు ఒకే కానీ బిజియం వర్కౌట్ కాలేదు. అసలే సాగదీతగా అనిపించే సన్నివేశాలకి కాస్త మంచి బిజియం ఇవ్వాల్సింది. ఎడిటింగ్ విభాగం కూడా విఫలం అయింది. చాలా సన్నివేశాల నిడివి తగ్గించి ఉండాల్సింది. లిరిక్స్, కెమెరా వర్క్ బావుంది. 

దర్శకుడి విషయానికి వస్తే.. అద్భుతమైన డ్రామా పండించే పాయింట్ తో కథ రాసుకున్నారు. కానీ ట్రీట్మెంట్ రొటీన్ గా ఉండడం వల్ల చాలా సీన్స్ చూసినట్లుగానే అనిపించాయి. కొత్తదనం లేదు. క్లారిటీ లేకుండా వదిలేసిన సీన్స్ ఈ చిత్రంలో చాలానే ఉంటాయి. 

ఫైనల్ థాట్ :

ప్రేమదేశం చిత్రంలో మంచి పాయింట్ ని రొటీన్ గా డీల్ చేశారు. యువతకి మెచ్చే కొన్ని రొమాంటిక్ మూమెంట్, కాస్త ఆసక్తిని పెంచే స్క్రీన్ ప్లే మాత్రమే ఈ చిత్రంలో ప్లస్ లు. మరొక ఆప్షన్ లేకుంటే ప్రేమకథా చిత్రాల ప్రియులు ఒకసారి ట్రై చేయొచ్చు. 

నటీనటులు, సాంకేతిక నిపుణులు :

మధుబాల, త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర, తనికెళ్ల బరణి, వైష్ణవి చైతన్య మరియు ఇతరులు.

ప్రొడక్షన్ హౌస్: సిరి క్రియేటివ్ వర్క్స్
సినిమా : "ప్రేమదేశం "
విడుదల తేదీ  ఫిబ్రవరి 3, 2023
నిర్మాత: శిరీష సిద్ధమ్
దర్శకుడు: శ్రీకాంత్ సిద్ధమ్
సంగీతం: మణిశర్మ
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ : రఘు కళ్యాణ్ రెడ్డి, రాము
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ : కమల్, కిరణ్, రూపా
పి. ఆర్. ఓ : హరీష్, దినేష్

click me!