Published : Apr 25, 2022, 08:05 AM ISTUpdated : Apr 25, 2022, 08:07 AM IST
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఏప్రిల్ 25 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే హిమ, ప్రేమ్ లు కాఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మనసులో ప్రేమ్ (Prem) ఈరోజు ఎలాగైనా హిమను ప్రేమిస్తున్న సంగతి చెప్పేయ్యాలి దానికి ఎలాంటి ఆటంకాలు రాకూడదు అని అనుకుంటాడు. ఈలోపు అక్కడకు అనుకోకుండా జ్వాల (Jwala) వస్తుంది.
25
ఇక ప్రేమ్ (Prem) వాళ్ళు ఆర్డర్ చేసిన కాఫీ జ్వాల వచ్చి తీసుకొని తాగుతుంది. దాంతో ప్రేమ్ తన పై ఒక రేంజ్ లో చిరాకు పడతాడు. మరోవైపు నిరూపమ్ (Nirupam) మన విషయం మమ్మీ వాళ్లకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు హిమ అంటూ తన ఫోటో చూసుకుంటూ కలలు కంటూ ఉంటాడు.
35
ఆ తర్వాత అక్కడకు హిమ (Hima) వస్తుంది. ఒక పేషెంట్ కి మాత్రం భయపడకుండా ఇంజక్షన్ చేస్తుంది. దాంతో నిరూపమ్ (Nirupam) నీలో ఇంత మార్పా అంటూ ఆనంద పడుతూ ఉంటాడు. దాంతో హిమ నన్ను జ్వాల కు అప్పగించారు కదా ఆ ట్రైనింగ్ మహిమ ఇది అని అంటుంది.
45
ఇక నిరూపమ్ (Nirupam) మన మధ్య స్వారీలు థాంక్సు లు ఉండకూడదు అని అంటాడు. ఆ మాటతో జ్వాల నేను ఫిక్స్ అయ్యాను నువ్వే నా మొగుడివి.. నువ్వే నా లోకమని మనసులో అనుకుంటుంది. ఆ తరువాత హిమ (Hima) మామిడికాయ కోయడానికి కష్ట పడుతూ ఉంటుంది. ఈలోపు నిరూపమ్ వచ్చి తనను ఎత్తుకొని ఆ మామిడికాయ కోపిస్తాడు.
55
ఇక తరువాయి భాగం లో సౌందర్య (Soundarya) తన మనవరాలి చిన్నప్పటి ఫోటో ద్వారా ఇప్పుడు ఎలా ఉంటుందో అని ఒక ఆర్టిస్ట్ తో తన చిత్రాన్ని గీపిస్తుంది. అది తెలుసుకున్న జ్వాల (Jwala) నేను కూడా నా శత్రువు బొమ్మ గీయించాలి అని హిమ తో అంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.