`సలార్‌`లో ప్రశాంత్‌ నీల్‌ చేసిన మ్యాజిక్‌ ఇదే.. సినిమాని ఎందుకు చూడాలంటే.. 10 హైలైట్స్

Published : Dec 22, 2023, 12:45 PM IST

ప్రభాస్‌ నటించిన `సలార్‌` చిత్రానికి పాజిటివ్‌ టాక్ వస్తుంది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చేసిన మ్యాజిక్‌ వర్కౌట్ అయ్యింది. సినిమాలో ఉన్న హైలైట్‌, మూవీ చూడ్డానికి పది కారణాలపై ఓ లుక్కేద్దాం.   

PREV
113
`సలార్‌`లో ప్రశాంత్‌ నీల్‌ చేసిన మ్యాజిక్‌ ఇదే.. సినిమాని ఎందుకు చూడాలంటే.. 10 హైలైట్స్

`సలార్‌` సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం విడుదలైంది. మూడు సార్లు వాయిదా పడి ఈ మూవీ ఎట్టకేలకు నేడు విడుదలైంది. ప్రభాస్‌ని ఇలాంటి సినిమాలో చూడాలనుకున్న ఫ్యాన్స్ కల నెరవేరింది. `సలార్‌` ప్రస్తుతం థియేటర్లలో హంగామా చేస్తుంది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. తన కింద ఏ సినిమా నిలవదనే సందేశాన్నిస్తుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియా మొత్తం, ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా ప్రభావం చూపించే ప్రపంచం అంతటా ఇప్పుడు `సలార్‌` మేనియా నడుస్తుందని చెప్పొచ్చు. 
 

213

ప్రారంభం నుంచే `సలార్‌` సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మొదటి షో రిజల్ట్ నుంచే `ఊచకోత` అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి. మరి `సలార్‌` సినిమాలో ఏం బాగున్నాయి. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చేసిన మ్యాజిక్‌ ఏంటి? సినిమా ఎలా వచ్చింది, ఇందులో హైలైట్స్ ఏంటి? ఆడియెన్స్ ఎందుకు చూడొచ్చు అనే విషయాలను తెలియజేసే ప్రయత్నం. 
 

313

ప్రభాస్‌ నుంచి సరైన సినిమా చాలా ఏళ్లు అవుతుంది. `బాహుబలి` తర్వాత ఆయనకు హిట్‌ రాలేదు. బాహుబలిగా ఆయన్ని చూసిన ఆడియెన్స్ మామూలు పాత్రల్లో చూడలేకపోయారు. `సాహో` యాక్షన్‌ సినిమా అయినా, అది కనెక్ట్ కాలేదు. దర్శకుడు సరిగా తీయలేకపోయారు. దీంతో అది పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చిన `రాధేశ్యామ్‌` సైతం డిజప్పాయింట్‌ చేసింది. యాక్షన్‌ హీరోని లవర్‌ బాయ్‌ చేస్తే ఆడియెన్స్ అంగీకరించలేకపోయారు. `ఆదిపురుష్‌` సైతం యానిమేటెడ్‌ మూవీ అయ్యింది. జీవం లేని ప్రభాస్‌ని చూసినట్టే అనిపించింది. దీంతో హ్యాట్రిక్‌ ఫ్లాప్స్ ఎదురయ్యాయి. 
 

413

అప్పట్నుంచి అభిమానులు ప్రభాస్ యాక్షన్‌ సినిమాలో, తన కటౌట్‌ కి తగ్గ కథలో చూడాలనుకున్నారు. ఇప్పుడు `సలార్‌` పడింది. ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కి, సాధారణ ఆడియెన్స్ కి ఏం కావాలో `సలార్‌`లో మేళవించి దట్టించాడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ప్రభాస్‌కి తగ్గ యాక్షన్‌ ఎలిమెంట్లని జోడించాడు. ఒకదాని మించి మరోటి అనేలా యాక్షన్‌సీన్లని డిజైన్‌ చేశాడు. అదే సినిమాకి బిగ్గెస్ట్ అసెట్‌. 
 

513

ప్రభాస్‌ కటౌట్‌ని సరిగ్గా వాడుకున్నాడు ప్రశాంత్‌ నీల్‌. భారీ హైట్‌, పర్సనాలిటీ ప్రభాస్‌ సొంతం. ఆ కటౌట్‌ని పెట్టుకుని ఏమైనా చేయోచ్చు అనేది తాజాగా ప్రశాంత్‌ నీల్‌ చూపించాడు. ఆయన కొడితే విలన్లు చిత్తైపోవడం ఇందులో చూడొచ్చు. అది చూసిన ఆడియెన్స్ విజిల్స్ వేయడం ఇందులో ప్రత్యేకత. కటౌట్‌ తగ్గ భారీ యాక్షన్‌ సీన్లు పెట్టాడు దర్శకుడు. 
 

613

మొదటి భాగంలో రెండు యాక్షన్‌ సీన్లు, రెండో భాగంలో మరో రెండు యాక్షన్‌ సీన్లు. ఇందులో ఒకదాని మించి ఒకటి ఉంటాయి. మిషన్‌ గన్నులు, కత్తులు, గొడ్డల్లు ఇలా అన్ని రకాల ఆయుధాలను ఇందులో ప్రయోగించారు. ప్రభాస్‌కి అవన్నీ బానిస అనేలా డైరెక్టర్‌ వాటిని డిజైన్‌ చేశాడు. ప్రభాస్‌ కనిపిస్తే చాలు ప్రత్యర్థులకు చెమటలు పడతాయనేలా కథని తీసుకెళ్లడం విశేషం. 
 

713

ఇక ఎలివేషన్లు సినిమాని నడపించాయి. ఎలివేషన్లే సినిమా అని చెప్పొచ్చు. ప్రభాస్‌ కనిపిస్తే చాలు థియేటర్లలో కూర్చున్న ఆడియెన్స్ పూనకాలు తెప్పిస్తుంటుంది. ఆ రేంజ్‌లో ఎలివేషన్లు పెట్టాడు. అయితే ఎక్కడా అవి ఓవర్‌గా అనిపించవు. ఇంకా చెప్పాలంటే కొంత తక్కువే అనిపిస్తుంది. ప్రభాస్‌ కటౌట్‌ని చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్‌ అంటుంటారు, కదా.. ఈ సినిమాలో అదే  మ్యాజిక్‌ చేశాడు దర్శకుడు. 
 

813

ఇక ఫ్రెండ్స్ షిప్‌కి పెద్ద పీఠ వేశాడు దర్శకుడు. ప్రభాస్‌(దేవా), పృథ్వీరాజ్‌(వరదా) ల మధ్య స్నేహాన్ని బలంగా చూపించారు. ఎందుకు ఒకరికోసం ఒకరు ఎంతగా ప్రాణం ఇస్తారో కళ్లకి కట్టినట్టు చూపించాడు. అంత బలంగానూ చూపించాడు. సినిమాలో ఎమోషనల్‌గా ఆకట్టుకునే అంశం ఈ స్నేహం. 

913

లేడీస్‌ సెంటిమెంట్‌. సినిమాలో ఫ్రెండ్‌షిప్‌ మాత్రమే కాదు, లేడీస్‌ సెంటిమెంట్‌ని కూడా పెట్టాడు. ఎమోషనల్‌గా మరింత కనెక్ట్ కావడానికి ఆ ఎలిమెంట్ ని ఎంచుకున్నాడు దర్శకుడు. ఖాన్సార్‌ సామ్రాజ్యంలో ఒకడు ఆడ పిల్లలను రోజుకొకరిని ఎత్తుకుని అఘాయిత్యాలకు పాల్పడుతుంటే ఎవరూ ఏం చేయలేకపోతుంటారు. దాన్ని ప్రభాస్‌ ఎలా అడ్డుకున్నాడు, ఆడ పిల్లల జోలికొస్తే ఏం జరుగుతుందో ప్రభాస్‌ చేత చూపించాడు దర్శకుడు. ఇలా ఫ్యామిలీ ఆడియెన్స్ ని, ముఖ్యంగా మహిళలకు కనెక్ట్ చేశాడు దర్శకుడు. 

1013

పాటలు.. సినిమాకి పాటలు మరో హైలైట్‌. ఒక స్నేహంపై వచ్చే `సూరిడే .. ` పాట, మరోటి ప్రభాస్‌పై వచ్చే మరో పాట. రాక్షసుడు ఎంత క్రూరంగా ఉంటాడని, ప్రభాస్‌ గతాన్ని వర్ణించేలా ఆ పాట సాగుతుంది. స్కూల్‌ పిల్లలకు చెడు గురించి ఈశ్వరీ రావు చెప్పే క్రమంలో ఈ పాట సాగుతుంది. ఈ రెండు మంచి ఫ్యామిలీ ఆడియెన్స్ ని కనెక్ట్ అవుతాయి. 

1113

రవి బన్సూర్‌ మ్యూజిక్‌తోపాటు బీజీఎం అదరిపోయింది. రెండు పాటలతోపాటు ప్రభాస్‌ని ఎలివేట్‌ చేసే సీన్లలో బీజీఎం, అలాగే యాక్షన్‌ సీన్లలో వచ్చే బిజీ మోత మొగించేలా ఉంది. ఒళ్లు గగుర్పాటుకి గురి చేసేలా ఉంది. అదే సినిమాకి హైలైట్‌గా నిలిచింది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌. మొదటి భాగాన్ని, సెంటిమెంట్్‌లో కూల్‌గా నడిపించి ఇంటర్వెల్‌ వరకు నెమ్మదిగా లేపుకుంటూ వెళ్లాడు. అక్కడ పీక్‌ కి తీసుకెళ్లి వదిలేశాడు. ఇక రెండో భాగంలో గ్యాప్‌ ఇవ్వకుండా ఓ వైపు స్నేహం, మరోవైపు ఎలివేషన్లు, ఇంకోవైపు యాక్షన్‌ తో మడమ తిప్పనీయకుండా చేశాడు. అదే దర్శకుడిగా ఆయన చేసిన మ్యాజిక్‌ అని చెప్పొచ్చు. 

1213
prabhas, rajamouli , Prashanth Neel- Salaar

దీనికితోడు నటీనటులు.. ప్రభాస్‌ జస్ట్ కటౌట్‌తో సినిమాని నడిపించాడు. శాషించాడు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సైతం సెటిల్డ్ గా అదరగొట్టాడు. శృతి హాసన్‌ తనస్టయిల్‌ చేసేసింది. ఈశ్వరీరావు ఎమోషన్స్ తో, సెంటిమెంట్‌లో మెప్పించింది. జగపతిబాబు కింగ్‌గా కాసేపు వాహ్‌ అనిపించాడు. శ్రియా రెడ్డి పాత్ర అదిరిపోయింది. ఇతర పాత్రదారులు సైతం మెప్పించారు. 
 

1313
salaar song Prathikaramo

ఇక విజువల్స్ సినిమాకి మరో పెద్ద అసెట్‌. చాలా సీన్లు విజువల్‌ ట్రీట్‌లా ఉంటాయి. కలర్‌ టోన్‌ బ్లాకే అయినా, దాన్ని కూడా విజువల్‌ ట్రీట్‌లా మలిచారు భువన్‌ గౌడ. దీన్ని మించిన విజువల్‌ ఎఫెక్స్. ఖాన్సార్‌ కోట గానీ, యాక్షన్‌ సీన్లు గానీ అదిరిపోయాయంటే విజువల్‌ ఎఫెక్ట్ లోని సహజత్వం. అలాగే ఆర్ట్ వర్క్ మరో అసెట్‌ సినిమాకి. ఇలా అన్ని బాగా కుదిరాయి. ఇప్పుడు `సలార్‌`ని భారీ యాక్షన్‌ ప్యాక్డ్ మూవీగా మలిచాయి. ప్రస్తుతానికి సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. మరి కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్‌కి వెళ్తుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories