దేశంలోనే గొప్ప దర్శకుడిగా చలామణి అవుతున్న రాజమౌళి (Rajamouli)కి కెజిఎఫ్ చాప్టర్ 2 తో ప్రశాంత్ నీల్ సవాల్ విసిరారు. అతి తక్కువ బడ్జెట్ తో అంత గొప్ప చిత్రం తీయొచ్చని నిరూపించారు. రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ (RRR Movie) వేయి కోట్లు రాబట్టినా లాభాల లెక్కలో ఎక్కడో ఉంది. పుష్ప, ఆర్ ఆర్ ఆర్ వంటి పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన ప్రాఫిట్స్ కంటే బాలకృష్ణ అఖండ భారీ లాభాలు పంచింది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ మూవీ విజయం డిస్ట్రిబ్యూటర్స్ ని ఏమంత సంతోష పరచలేదు.