ప్రణీతా పద్ధతిగా మెరిసినా అందంతో ప్రాణాలు తోడేస్తోందిగా.. ట్రెడిషనల్ వేర్ లో బ్యూటీఫుల్ లుక్

First Published | Jul 1, 2023, 11:27 AM IST

యంగ్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) ఎప్పటికప్పుడు తన బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంటోంది. పద్ధతిగా మెరిసినా గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. రోజురోజుకు మరింత అందంగా మెరుస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది.
 

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ తెలుగు ప్రేక్షకులకు ఎంతలా దగ్గరైందో తెలిసిందే. తన అందం, నటనతో మంచి ఫాలోయింగ్ ను దక్కించుకుంది. వరుస చిత్రాలతో అలరిస్తూ వచ్చింది. తన పెళ్లి, ప్రెగ్నెన్సీ, పాపకు జన్మనివ్వడం కారణంగా కొద్దినెలలు సినిమాలకు దూరంగా ఉంది. 
 

ప్రస్తుతం మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కెరీర్ ను మరింత జోరుగా నడిపించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రణీతా ఆఫర్లు కూడా అందుకుంటోంది. మొన్నటి వరకు తెలుగు, కన్నడ, తమిళంలోనే సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు  మలయాళంలోకీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. 
 


మలయాళ స్టార్ నటుడు దిలీప్ కుమార్ సరసన ప్రణీతా నటిస్తోంది. Dileep 148 వర్క్ టైటిల్ తో సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రణీతాకు ఇది మాలీవుడ్ లో తొలిసినిమా. దీంతో చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. అలాగే ఈ ముద్దుగుమ్మ ‘రమణ అవతార’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇది ఎప్పుడో అనౌన్స్ చేసిన సినిమా. రిలీజ్ కావాల్సి  ఉంది.
 

ఇక కొత్త సినిమాలను లైన్ లో పెట్టేందుకు ప్రణీత ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ దర్శక నిర్మాతల కంట్లో పడేందుకు యత్నిస్తోంది. 

తాజాగా బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. ట్రెడిషనల్ వేర్ లో ఆకర్షించింది. సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోయింది. ఈ క్రమంలో అదిరిపోయే స్టిల్స్ తో ఫొటోషూట్ చేసింది. ఇందుకు సంబంధించిన చిన్న వీడియోను అభిమానులతో పంచుకుంది. లైక్స్, కామెంట్లతో ఫ్యాన్స్  వైరల్ చేస్తున్నారు.
 

లేటెస్ట్ లుక్ లో ప్రణీతా గ్లామర్ మెరుపులతోనూ మతులు పోగొట్టింది. బ్యూటీఫుల్ గా మెరుస్తూనే నడుము, నాభీ అందంతో మైమరిపించింది. చిరునవ్వుతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. మత్తు చూపులతో హార్ట్ బీట్ పెంచేసింది. మొత్తానికి వరుసగా నయా లుక్స్ లో దర్శనమిస్తూ ఫిదా చేస్తోంది. 
 

Latest Videos

click me!