జబర్దస్త్ షోతో బుల్లితెరపై సుధీర్ తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. తింగరోడిగా కనిపిస్తూనే కామెడీ పంచ్ లతో సుధీర్ కడుపుబ్బా నవ్వించడం చూశాం. ఇక సుధీర్, రష్మీ మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇతర ఛానల్స్ లో అవకాశాలు రావడం, హీరోగా కూడా బిజీ అవుతుండడంతో ఆ మధ్యన సుధీర్ జబర్దస్త్ ని వదిలేశాడు.