Published : Apr 17, 2026, 02:15 PM ISTUpdated : Apr 18, 2026, 11:41 AM IST
రామాయణంపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయనపై కేసు కూడా నమోదైంది. మత మనోభావాలను దెబ్బతీశారని కొందరు ఆరోపిస్తుండగా, ఆన్‌లైన్‌లో ఈ అంశంపై పెద్ద చర్చే జరుగుతోంది.
రామాయణంపై చేసిన వ్యాఖ్యలతో నటుడు ప్రకాశ్ రాజ్ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఓ పబ్లిక్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ కావడంతో, సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
24
రామాయణంపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్..
ఈమధ్య కాలంలో చేసిన ప్రసంగంలో ప్రకాశ్ రాజ్, రామాయణంపై ప్రకాశ్ రాజ్ వేసిన జోకులు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే? రాముడు , లక్ష్మణుడు నార్త్ ఇండియా నుండి సౌత్ కి వచ్చిన వలస కూలీలు. రామ లక్ష్మణులు మన సౌత్ లోకి రాగానే ఓ తటలోకి వెళ్లి... అక్కడ ఓనర్ ను అడక్కుండా పండ్లను దొంగతనం చేసి తిన్నారు. ఆ పొలానికి యజమాని మరెవరో కాదు , గిరిజనుడు అయిన రావణాసురుడు. పండ్ల దొంగతనం పై రావణుడి సోదరి సూర్పనక్క ప్రశ్నించడం తో వివాదం మొదలైంది. జీఎస్టీ తో కలిపి 2000 డాలర్లు కట్టాలంటూ సూర్పనక్క డిమాండ్ చేసింది. అక్కడి నుండి గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్రమైన వివాదాలకు దారి తీసింది. ఇది కేవలం జోక్ అయినా, పవిత్ర గ్రంథాన్ని అవమానించడమేనని చాలామంది భావిస్తున్నారు.
34
విలక్షణ నటుడిపై ఆడియన్స్ ఆగ్రహం..
ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవ్వగానే, చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మత మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఆయనపై క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. రామాయణాన్ని అవమానించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివాదంపై ప్రజల అభిప్రాయాలు రెండుగా విడిపోయాయి. మత గ్రంథాలపై ఎలాంటి జోకులు వేయకూడదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ప్రకాశ్ రాజ్‌కు సపోర్ట్ గా నిలుస్తూ.. ఇది భావప్రకటనా స్వేచ్ఛ కిందికే వస్తుందని మరికొందరు వాదిస్తున్నారు.