అందాల హరివిల్లే ప్రగ్యా జైస్వాల్ గా మారిందా.. కళ్ళు మిరిమిట్లు గొలిపే సౌందర్యంతో అఖండ బ్యూటీ

Published : Jul 10, 2022, 12:59 PM IST

గ్లామర్ పరంగా ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది.

PREV
17
అందాల హరివిల్లే ప్రగ్యా జైస్వాల్ గా మారిందా.. కళ్ళు మిరిమిట్లు గొలిపే సౌందర్యంతో అఖండ బ్యూటీ

గ్లామర్ పరంగా ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 

27

బోయపాటి దర్శకత్వంలో Balakrishna సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. 

37

అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

47

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన Pragya Jaiswal ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. 

 

57

మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

67

తాజాగా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళని సమ్మోహన పరిచేలా ఉన్నాయి. ప్రగ్యా జైశ్వాల్ కళ్ళు చెదిరే లెహంగాలో చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది. నిలువెత్తు శిల్పంలా ప్రగ్యా ఇస్తున్న ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

77

ఆమె చిరునవ్వుకే నెటిజన్లు మాయలో పడిపోతున్నారు. సింపుల్ గా ఉన్న డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్  చిరునవ్వుతో చిచ్చు రేపుతోంది. ప్రగ్యా అందాలకు నెటిజన్లు మెస్మరైజ్ అవుతున్నారు. 

click me!

Recommended Stories