డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో హైపర్ ఆది, రాంప్రసాద్.. వీడియో చూపించి కిర్రాక్ ఆర్పీకి గట్టిగా ఇచ్చారుగా..

Published : Jul 10, 2022, 12:13 PM IST

జబర్దస్త్ తో గుర్తింపు సొంతం చేసుకున్న కమెడియన్స్ లో కిర్రాక్ ఆర్పీ ఒకరు. నెల్లూరు, చిత్తూరు యాసలో డైలాగులు చెబుతూ కిర్రాక్ ఆర్పీ ఫేమస్ అయ్యాడు. కానీ కొంత కాలానికి ఆర్పీ జబర్దస్త్ కి దూరం అయ్యాడు.

PREV
16
డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో హైపర్ ఆది, రాంప్రసాద్.. వీడియో చూపించి కిర్రాక్ ఆర్పీకి గట్టిగా ఇచ్చారుగా..

జబర్దస్త్ తో గుర్తింపు సొంతం చేసుకున్న కమెడియన్స్ లో కిర్రాక్ ఆర్పీ ఒకరు. నెల్లూరు, చిత్తూరు యాసలో డైలాగులు చెబుతూ కిర్రాక్ ఆర్పీ ఫేమస్ అయ్యాడు. కానీ కొంత కాలానికి ఆర్పీ జబర్దస్త్ కి దూరం అయ్యాడు. కానీ ఇటీవల కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ పై, మల్లెమాల సంస్థపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. 

26

జబర్దస్త్ విజయవంతం కావడంలో మల్లెమాల గొప్పతనం ఏమి లేదు.. అది తమ కష్టమే అన్నట్లుగా కిర్రాక్ ఆర్పీ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆర్పీ సమాధానం ఇస్తూ.. జబర్దస్త్ మాకు లైఫ్ ఇవ్వడం ఏంటి.. మేమే జబర్దస్త్ కి లైఫ్ ఇచ్చాం అని ఆర్పీ షాకింగ్ కామెంట్స్ చేశారు. మాకు మల్లెమాల లైఫ్ ఇవ్వలేదు.. మాకు లైఫ్ ఇచ్చింది నాగబాబు గారు అని ఆర్పీ తెలిపాడు. 

36

తమ వల్లే జబర్దస్త్ షోకి రేటింగ్స్ వచ్చాయి అని కూడా ఆర్పీ కామెంట్స్ చేశాడు. కిర్రాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలకు కౌంటర్ గా హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ రంగంలోకి దిగారు. మల్లెమాలలో ఫుడ్ సరిగ్గా ఉండదు.. ఆర్టిస్టులకు కనీసం సహాయం కూడా చేయరు అంటూ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు హైపర్ ఆది, ప్రసాద్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 

46

హైపర్ ఆది మాట్లాడుతూ.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్మాత, ఆయన మాజీ సీఎంకి అల్లుడు. అలాంటి వ్యక్తిని ఆర్పీ ఏకవచనంతో మాట్లాడడం.. ఓ మాట అనేయడం కరెక్ట్ కాదు అని హైపర్ ఆది అన్నారు. అలాగే జబర్దస్త్ కే తాము లైఫ్ ఇచ్చాం అని చెప్పడం.. సుధీర్, రష్మీ వల్ల.. తమ స్కిట్ వల్ల జబర్దస్త్ కి రేటింగ్ వచ్చాయని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. 

 

56

దర్శకుడు ఎంచుకునే కంటెంట్ వాళ్ళ షోకి రేటింగ్స్ వస్తాయి అని ఆది.. కిర్రాక్ ఆర్పీకి కౌంటర్ ఇచ్చారు. ఇక రాంప్రసాద్.. ఓ కిరాక్ ఆర్పీకి సంబంధించిన ఓ వీడియో బైట్ ప్లే చేశాడు. ఈ వీడియోలో ఆర్పీ.. గతంలో జబర్దస్త్ తమకి అమ్మలాంటిది అని పేర్కొన్నాడు. ఆర్పీ జబర్దస్త్ ని వదిలేశాక.. వేరే ఛానల్ కి వెళ్ళాక చాలా అబద్దాలు చెబుతున్నారు అంటూ ఆది, రాంప్రసాద్ ఆరోపించారు. 

66

ఇదంతా చూస్తుంటే.. జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికే హైపర్ ఆది, రాంప్రసాద్ రంగంలోకి దిగినట్లు అనిపిస్తోంది. ఇటీవల ఒక్కొక్కరుగా జబర్దస్త్ కి దూరం అవుతున్నారు. సుధీర్ వేరే ఛానల్ కి వెళ్ళిపోయాడు. అనసూయ కూడా జబర్దస్త్ ని వీడుతోంది. దీనితో ప్రస్తుతం ఉన్న కమెడియన్స్ తోనే జబర్దస్త్ కి పూర్వవైభవం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories