ఇక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ (Salman Khan)తో ‘మే ఛలా’ అనే మ్యూజిక్ వీడియోలో నటించిన ఈ బ్యూటీ హిందీ చిత్రాల్లో నటించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఇటు తెలుగు, అటు హిందీలో ఎలాంటి సినిమాను అనౌన్స్ చేయలేదు. మున్ముందు ప్రాగ్యా ఏ స్టార్ తో కలిసి నటించనుందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.