Anasuya: అనసూయ బాగా కమర్షియల్.. అలాంటి రోల్స్ ఒప్పుకోదు, డైరెక్టర్ మారుతి కామెంట్స్

Published : Jun 24, 2022, 05:13 PM IST

ఇదిలా ఉండగా అనసూయ యాంకర్ గా చేస్తున్న జబర్దస్త్ షోకి ' పక్కా కమర్షియల్' టీం అతిథులుగా హాజరయ్యారు. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్.

PREV
16
Anasuya: అనసూయ బాగా కమర్షియల్.. అలాంటి రోల్స్ ఒప్పుకోదు, డైరెక్టర్ మారుతి కామెంట్స్

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.  సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. 

26

అనసూయ కథని బట్టి తాను నటించే చిత్రాల విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.   

36

ఇదిలా ఉండగా అనసూయ యాంకర్ గా చేస్తున్న జబర్దస్త్ షోకి ' పక్కా కమర్షియల్' టీం అతిథులుగా హాజరయ్యారు. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా మారుతి, గోపీచంద్ జబర్దస్త్ షోకి అతిథులుగా హాజరయ్యారు. 

 

46

లేటెస్ట్ గా జబర్దస్త్ ప్రోమో విడుదలయింది. అనసూయతో కలసి మారుతి, గోపీచంద్ బాగా సందడి చేశారు. గోపీచంద్ జబర్దస్త్ వేదికపై పక్కా కమర్షియల్ డైలాగ్ చెప్పాడు. 'ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం.. మీరు ఇప్పుడు చేస్తున్నారు.. నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేశా' అంటూ అదరగొట్టాడు. 

56

ఇక ఈ చిత్రంలో అనసూయ కూడా నటిస్తోంది. మారుతి అనసూయ గురించి మాట్లాడుతూ.. మామూలు కమర్షియల్ కాదు ఈవిడ.. చిన్న చిన్న పాత్రలు చేయదు' అంటూ అనసూయని ఆటపట్టించాడు. 

66

ఇక జబర్దస్త్ కమెడియన్స్ చేసిన స్కిట్స్ గోపీచంద్ ని బాగా అలరించాయి. జయం మూవీ స్కూప్ తో గోపీచంద్ ని కమెడియన్లు ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు. పక్కా కమర్షియల్ మూవీ ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా జూలై 1న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపిస్తున్నాడు. 

click me!

Recommended Stories