
సినిమా ప్రెస్ మీట్లలో ఇటీవల సెలబ్రిటీలకు సంబంధించిన వివాదాలు బాగా హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా మీడియాతో `క్వశ్చన్ అండ్ ఆన్సర్స్` అనేది తరచూ వివాదంగా మారుతుంది. కొందరు సినిమా టీమే కావాలని ఇలాంటివి ప్లాన్ చేస్తుండగా, మరికొన్ని అనుకోకుండా వివాదాలుగా మారుతున్నాయి. అయితే గతంలోనూ ఇలాంటివి అడపాదడపా ఉండేవి. కానీ ఇటీవలే హైలైట్ అవుతున్నాయి. సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ప్రతిదీ పోస్ట్ చేయడంతో ఇవి హైలైట్ అవుతున్నాయి. ట్రోల్స్ కి, మీమ్స్ కి కారణమవుతున్నాయి. ఈ క్రమంలో ఆ మధ్య `డ్యూడ్` ప్రెస్ మీట్‌లో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్‌ని ఒక మహిళా జర్నలిస్ట్ `మీరు చూడ్డానికి హీరో మెటీరియల్ అనేలా ఉండరు. కానీ రెండు సినిమాలకే ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఈ సక్సెస్‌కి కారణం హార్డ్ వర్కా? లక్కా? ` అని ప్రశ్నించింది. దీంతో అది పెద్ద వివాదంగా మారింది. ఆ సమయంలో పక్కనే ఉన్న నటుడు శరత్ కుమార్ మైక్ తీసుకుని ఆ జర్నలిస్ట్ కి కౌంటర్ ఇచ్చాడు. హీరో అనే దానికి అర్థం ఏంటి? అని ప్రశ్నిస్తూ, ఇలానే ఉండాలనేది రూల్ లేదని, ప్రతిభ ఇక్కడ ముఖ్యం అని, ఆడియెన్స్ ని ఎంతగా ఎంటర్‌టైన్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్ అన్నారు. అలా, ఇలా ఉన్న వాళ్లు హీరో కాకూడదనే రూల్ లేదంటూ ఆయన గట్టిగా ఇచ్చాడు.
అయితే ఆ తర్వాత మరో ఇంటర్వ్యూలో హీరో ప్రదీప్ రంగనాథన్ రియాక్ట్ అవుతూ, దానికి పెద్దగా ఫీల్ కాలేదని, ఎందుకంటే తాను చిన్నప్పట్నుంచి ఇలాంటి అవమానాలు ఫేస్ చేస్తున్నట్టు తెలిపారు. అనేక అవమానాలను చూస్తూ పెరిగానని, కాబట్టి అవి తనకు కొత్త కాదని చెప్పాడు. ఆల్‌రెడీ అలాంటివి ఫేస్ చేశాను కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. ఈ విషయాలు చెప్పే సమయంలో ఆయన కళ్లల్లో మాత్రం ఆ పెయిన్ కనిపిస్తోంది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకి ప్రదీప్ రంగనాథన్‌ని అంతగా అవమానించిన ఆ జర్నలిస్ట్ ఎవరనేది తెలుసుకుంటే, పేరు లక్ష్మి. ఆమె వీ6 న్యూస్ ఛానెల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ రిపోర్టర్‌గా పనిచేస్తోంది. గతంలో న్యూస్, పొలిటికల్ విభాగంలో పనిచేసిన ఆమె ఇప్పుడు సినిమా విభాగంలో పనిచేస్తోంది. గత నాలుగైదేళ్లుగా ఈ విభాగంలో వర్క్ చేస్తోంది.
అయితే లక్ష్మి సృష్టించిన వివాదం ప్రదీప్ రంగనాథన్‌ని సంబంధించినదే కాదు, గతంలోనూ చాలా ఉన్నాయి. ఇటీవలే మరో వివాదం కూడా క్రియేట్ చేసింది. `తెలుసు కదా` ట్రైలర్ ఈవెంట్‌లోనూ హీరో సిద్ధు జొన్నలగడ్డని ఇలాంటి ప్రశ్ననే అడిగింది. సినిమా ట్రైలర్‌లో హీరో ఉమనైజర్‌గా కనిపించడంతో, రియల్ లైఫ్‌లోనూ మీరు ఎలా ఉంటారు? ఇద్దరు అమ్మాయిలతో లవ్ ట్రాక్ నడిపించిన సందర్భాలున్నాయా? అంటూ ప్రశ్నించింది. దానికి సిద్ధు ఆచితూచి సమాధానం చెప్పారు. అది సినిమాలో హీరో పాత్ర అలా ఉంటుందన్నారు. రియల్ లైఫ్‌కి సంబంధించి ఇది తన పర్సనల్ ఇంటర్వ్యూ కాదని చెప్పారు. ఆ తర్వాత మరో సందర్భంలో ఈ ప్రశ్నపై ఆయన మాట్లాడుతూ, ఆమె అలా ప్రశ్నించడం అగౌరవమని, మైక్ ఉంది కదా అని ఏది పడితే అది అడగడం కరెక్ట్ కాదన్నాడు సిద్ధు.
గతంలోనూ లక్ష్మి మరో పెద్ద రచ్చకి తెరలేపింది. తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్లని `పొట్టేల్` మూవీ ప్రెస్ మీట్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి అడిగింది. హీరోయిన్లకి సినిమా ఒప్పుకునే ముందే, కమిట్‌మెంట్ కి సంబంధించి కూడా అగ్రిమెంట్ తీసుకుంటారట, నిజమేనా, మీరు అలాంటివి ఫేస్ చేశారా? అని అడిగింది. దానికి ఆ హీరోయిన్ షాక్ అయ్యింది. కమిట్‌మెంట్ అడుగుతారని మీకెలా తెలుసు అని తిరిగి ప్రశ్నించింది. అలాంటివి లేవని, తాను ఫేస్ చేయలేదని తెలిపింది. అలాంటి ఉంటే ఉండొచ్చు, అంతేకాని అవకాశం ఇచ్చేటప్పుడే ఇలాంటివి చేస్తారనేది పెద్ద బుల్‌షిట్ అని తెలిపింది అనన్య. ఈ విషయం పెద్ద వివాదంగా మారడంతో ఏకంగా ఫిల్మ్ ఛాంబర్ సీరియస్ అయ్యింది. మా అసోసియేషన్ కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఆ జర్నలిస్ట్ ఆ నటికి క్షమాపణలు చెప్పడం గమనార్హం.
అయితే దీనిపై ఆ జర్నలిస్ట్ మాట్లాడుతూ, తాను ఇండస్ట్రీలో ఉన్న వాస్తవాల గురించే ప్రశ్నిస్తున్నాను. జనాల్లో అనేక అపొహలు ఉన్నాయి. వాటిని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాను. కానీ వాటిని తప్పుగా తీసుకుంటున్నారు. అవి తప్పుగా కన్వే అవుతున్నాయి. ప్రదీప్ రంగనాథన్ విషయంలోనూ తాను ఆయన ఎంత కష్టపడి ఎదిగాడో చెప్పించే ప్రయత్నం చేశాను. ఆయన స్ట్రగుల్స్ గురించి తెలియజేయాలని, టాలెంట్‌కి హీరో ఫిజిక్‌తో సంబంధం లేదని చెప్పించే ప్రయత్నం చేశాను. కానీ అది తప్పుగా కన్వే అయ్యింది. ఆయన్ని కించపరచాలనే ఉద్దేశ్యం అస్సలు లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారికి కష్టాలు ఉంటాయి, అవమానాలుంటాయని అనేది తన అభిప్రాయమని వెల్లడించింది లక్ష్మి.