ప్రభుదేవా సౌత్ లో అరుదైన నటుడు. మల్టీ ట్యాలెంట్ ఉన్న వ్యక్తి ప్రభుదేవా. తన డ్యాన్స్ ప్రతిభతో ఇండియన్ మైకేల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన ప్రభుదేవా ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, దర్శకుడిగా రాణించారు. ప్రభుదేవా చాలా తెలుగు చిత్రాలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ అందించారు. ప్రతి డ్యాన్స్ మాస్టర్ కెరీర్ లో కొరియోగ్రఫీ చేసిన తొలి సాంగ్ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది.