Prabhas with Krithi Shetty: బంపర్ ఆఫర్ కొట్టేసిన కృతి శెట్టి... ప్రభాస్ హీరోయిన్ గా ఛాన్స్ నిజమేనా...?

First Published | Mar 16, 2022, 2:21 PM IST

నక్కతోక తొక్కకుంటూ ఇండస్ట్రీకి వచ్చి ఉంటుంది కృతి శెట్టి.. కెరీర్ బిగినింగ్ నుంచీ తిరుగులేని సక్సెస్ లతో దూసుకుపోతోంది. వరుస ఆఫర్లతో బిజీగా మారుతుంది. ఇంకోన్ని రోజుల్లో చిన్న హీరోలకు అందేట్టు లేదు ఉప్పెన భామ. 

అందానికి అందం..అదృష్టానికి అదృష్ణం ఈరెండు తోడైతే ఎలా ఉంటుంది అంటే హీరోయిన్ కృతీ శెట్టిలా ఉంటుంది అని టక్కున చెప్పవచ్చు. ఇండస్ట్రీలోకి కృతీ అడుగు పెట్టిన వేళా విశేషం బాగుంది. ఒక సినిమా తరువాత ఒకటిగా సినిమాలు ఆమె గుమ్మం ముందుకు వచ్చి ఆగుతున్నాయి. 
 

వరుస అవకాశాలు వచ్చి ఒళ్లో వాలిపోతున్నాయి కృతీ శెట్టికి. స్టార్ హీరోల కన్ను కూడా ఇప్పుడు కృతీ మీద పడింది. ఇటు  ఈ భామ కూడా కెరియర్ పై పూర్తి క్లారిటీతోనే ఉంది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన కృతి, ఈ ఏడాదితోనే మరో మూడు సినిమాల ద్వారా యూత్ ను పలకరించనుంది. 


ప్రస్తుతం కృతీ శెట్టి ఖాతాలో సుధీర్ బాబుతో చేస్తోన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో పాటు రామ్ పోతీనేనితో ది వారియర్ .. నితిన్ తో మాచర్ల నియోజక వర్గం సినిమాలు ఉన్నాయి. 
 

ప్రస్తుతం స్టార్ హీరోల కన్ను కృతీ శెట్టి పైన పడింది. ఏకంగా యూనివర్సల్ స్టార్ ప్రభాస్ జోడీగా నటించే బంపర్ ఛాన్స్ కొట్టేసిందని ఇండస్ట్ర టాక్ నడుతుస్తోంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి రాజా డీలక్స్ సినిమా దాదాపు ఫిక్స్ అయినట్టే. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. 

ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు నాయికలు కనిపించనున్నారు. అందలో కృతి శెట్టిని కూడా ఒక హీరోయిన్ గా ఫిక్స్ చేశారట మేకర్స్. కృతీతో పాటుగా మాళవిక మోహనన్ ను మరో హీరోయిన్ గా తీసుకున్నారట. ఇక ఆతరువాతి హీరోయిన్ ఎవరు అనేదానిపై సస్పెన్స్ నడుస్తోంది. 
 

ఇలా ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే తన టాలెంట్ ను ప్ర్రూ చేసుకుని హీరోయిన్ గా స్టార్ డమ్ ను చాలా తక్కువ టైమ్ పో అనుభవిస్తుంది కృతీ శెట్టి. ప్రభాస్ తో సినిమా పడి.. అది హిట్ అయితే.. కృతీ చేతికందటం కష్టమే. అంతే కాదు రేటు కూడా ఎంత పెంచుతుందో అని ఇప్పటినుంచే నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. 

ఇక వరుస సినిమాలతో దూసుకుపోతోంది కృతీ శెట్టి. రెమ్యూనరేషలన్ కూడా పెంచినట్టు తెలుస్తోంది. అంతే కాదు హాట్ హాట్ సీన్స్ చేయడానికి కూడా సై అంటుంది బ్యూటీ. శ్యామ్ సింగరాయ్ లో అడల్ట్ సీన్స్ తో రెచ్చిపోయింది. నానీతో రోమాన్స్ చేసింది. లిప్ లాక్ తో సెగపుట్టించింది. క్యారెక్టర్ డిమాండే చేస్తే.. దేనికైనా రెడీ అంటోంది ముద్దు గుమ్మ. 
 

అంతే కాదు టాలీవుడ్ లో తన స్టామినా నిరూపించుకున్న ఈ కన్నడ బ్యూటీ కోలీవుడ్ పై కూడా కన్నేసింది. తమిళ స్టార్ హీరో సూర్య, ప్రయోగాల డైరెక్టర్ బాల కాంబినేషన్లో రూపొందే సినిమాలో హీరోయిన్ గా కృతీ  సెలక్ట్ అయ్యిందని సమాచారం. ఈ దెబ్బతో తమిళ్ ఆడియ్స్ ను కూడా మెస్మరైజ్ చేయడానికి రెడీ అయ్యింది బ్యూటీ.

Latest Videos

click me!