ప్రభాస్ ఫౌజీగా.. మల్టీ డైమెన్షనల్ పాత్రలో! డిటేల్స్

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న బ్రిటీష్ కాలం నాటి యాక్షన్ ప్యాక్డ్ పీరియడ్ డ్రామాలో మల్టీ డైమెన్షనల్ పాత్రలో కనిపించనున్నారు. 1945 నాటి బ్రిటీష్ ఆర్మీలో పనిచేసే భారతీయ సైనికుడి కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Prabhas Takes on a Multi-Layered Role in Fauji jsp
Prabhas, Multi-Layered, Fauji, Hanu Raghavapudi


దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi), హీరో ప్రభాస్‌ (Prabhas) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సోషల్‌మీడియా స్టార్‌ ఇమాన్వీ ఎస్మాయిల్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు.  ఈ చిత్రం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ సినిమా  బ్రిటీష్ కాలం నాటి యాక్షన్ ప్యాక్డ్ పీరియడ్ డ్రామా. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర మల్టీ డైమన్షనల్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

Prabhas Takes on a Multi-Layered Role in Fauji jsp
Hanu Raghavapudi,Fauji , Prabhas, Mythri Movie Makers


ఆంగ్ల మీడియా కథనం ప్రకారం  "ఫౌజీలో ప్రభాస్  పాత్ర చాలా ఛాలెంజింగ్ గా మరియు మల్టీ  డైమెన్షనల్‌గా ఉంటుంది. 1945 లో బ్రిటీష్ ఆర్మిలో పనిచేసే ఓ భారతీయ సైనికుడు కథ ఇది. ప్రబాస్ లో  తీవ్రమైన ఆవేశం,  మృదువైన మనస్సు రెండింటినీ చూపించటానికి వీలు కల్పిస్తుంది.

బాహుబలి తర్వాత  ఈ సినిమానే ప్రభాస్ లోని నటుడుని పూర్తి స్దాయిలో ఆవిష్కరిస్తుంది. ప్రభాస్  లార్జన్ దేన్ లైఫ్ ఇమేజ్ ని ఈ సినిమా మరోసారి చూపిస్తుంది. జయప్రధ, మిథున్ చక్రవర్తి కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు" . 
 


Hanu Raghavapudi,Fauji , Prabhas, Mythri Movie Makers


ఈ చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు హను రాఘవపూడి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రభాస్‌ కోసమే తాను ఈ కథ రాశానని అన్నారు. ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసే ఎన్నో విశేషాలు ఈ సినిమాలో ఉంటాయని తెలిపారు. ‘‘ఈ చిత్రం తప్పకుండా కొత్తగా ఉంటుంది. మీరు ఇంతవరకూ చూడని కథను చూపిస్తున్నాం.

ప్రభాస్‌ ఉన్నారు కాబట్టి ఎన్ని అంచనాలను అయినా ఇది అందుకుంటుంది. ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ‘సీతారామం’ తర్వాత దీనిని రాయడానికే సుమారు ఏడాదికి పైగా సమయం పట్టింది. ప్రేక్షకులు తప్పకుండా సర్‌ప్రైజ్‌ ఫీలవుతారు’’ అని అన్నారు.
 

Latest Videos

click me!