ప్రభాస్‌ షాకింగ్ లుక్‌, కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ అలా.. రజనీకాంత్‌ సినిమాని గుర్తు చేస్తుందే!

First Published | Oct 23, 2024, 5:13 PM IST

ప్రభాస్‌ ఇప్పటి వరకు మాస్‌, యాక్షన్‌, కమర్షియల్‌ సినిమాలు చేశారు. మొదటిసారి ఆయన హర్రర్‌ మూవీ `ది రాజాసాబ్‌` చేస్తున్నారు. ఇందులో డార్లింగ్‌ లుక్‌ షాకిస్తుంది.
 

డార్లింగ్‌ ప్రభాస్‌ నేడు 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తన బర్త్ డేని ఫ్యాన్స్ భారీగా సెలబ్రేట్‌ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డార్లింగ్‌ అభిమానులు బర్త్ డే ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కోసం ట్రీట్‌ ఇచ్చాడు డార్లింగ్‌. తాను లేటెస్ట్ గా నటిస్తున్న `ది రాజా సాబ్‌` సినిమా నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ మేరకు మోషన్‌ పోస్టర్‌ ని విడుదల చేశారు.  ఓ రకంగా ఆయన పాత్ర తాలుకూ ఫస్ట్ లుక్ ఇచ్చారని చెప్పొచ్చు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

మోషన్ పోస్టర్ ను యూనిక్ గా డిజైన్ చేశారు. ఒక అడవిలో నడిచి వెళ్తున్న వ్యక్తి పెద్ద భవంతికి చేరుకుంటాడు. అక్కడ సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్న రాజా సాబ్ ను మోషన్ పోస్టర్ లో పరిచయం చేశారు. చేతిలో సిగార్, సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్ తో ప్రభాస్ రాజా సాబ్ క్యారెక్టర్ వింటేజ్ లుక్ అదిరిపోయింది. అయితే మాస్‌ హీరోగా ఎస్టాబ్లిష్‌ అయిన ప్రభాస్‌, ఇందులో సరికొత్తగా కనిపిస్తున్నారు.

ఓ రకంగా చూడ్డానికి ఆయన ఘోస్ట్ లా కనిపిస్తున్నారు. ప్రభాస్‌ డ్రెస్‌ మాత్రం రాజులను తలపిస్తుంది. సింహాసనంపై కూర్చొని రాయల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ లేటెస్ట్ లుక్‌ అదిరిపోయింది. ప్రభాస్‌ సరికొత్తగా ఉన్నారు. మాస్‌, యాక్షన్‌ సినిమాలే చేసుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఇందులో ఘోస్ట్ లా కనిపించడం ఆశ్చర్యపరుస్తుంది. 
 


మాస్‌ కటౌట్‌తో దుమ్ములేపే ప్రభాస్‌ ఇలా ఘోస్ట్ గా మారి కనిపించడంతో ఫ్యాన్స్ సైతం అవాక్కవుతున్నారు. అయితే రాజులా ఉన్నప్పుడు రాయల్‌ లుక్‌లో యోధుడిలా కనిపించాలి. కానీ ఆయన కాలు మీద కాలేసుకుని, కాళ్లు పట్టుకుని వంగినట్టుగా కనిపించడమే కొంత డిఫరెంట్‌గా అనిపిస్తుంది. మరి ఈ లుక్‌ వెనుక ఏదో బలమైన కాన్సెప్ట్ ఉంటుందని తెలుస్తుంది.

అదేంటో సినిమాల్లో చూస్తేనే తెలుస్తుందని అంటుంది టీమ్‌. ఈ మోషన్ పోస్టర్ కు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ చేసిన `రాజా సాబ్` థీమ్ సాంగ్ ఆకర్షణగా నిలుస్తోంది. హారర్ ఈజ్ ది న్యూ హ్యూమర్ అనే క్యాప్షన్ మోషన్ పోస్టర్ చివరలో వేయడం ద్వారా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసే హారర్ ఫ్లస్ కామెడీ "రాజా సాబ్" లో ఉండబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు.

ప్రభాస్‌ తన కెరీర్‌లో మొదటిసారి హర్రర్‌ సినిమా చేస్తున్నారు. `ది రాజా సాబ్‌` హర్రర్‌ ఎలిమెంట్లతోనే తెరకెక్కుతుందట. ఈ పోస్టర్‌ని చూస్తుంటే ప్రభాస్‌ ఓ కింగ్‌గా, అయనే దెయ్యంగా కనిపిస్తున్నారు. ఇది చూడ్డానికి రజనీకాంత్‌ `చంద్రముఖి` సినిమాని తలపిస్తుండటం విశేషం. ఇందులో రజనీకాంత్‌ సైకాలజిస్ట్ గా, ఆ తర్వాత రాజుగా కనిపించి ఆకట్టుకున్నారు.

ప్రభాస్‌ సినిమాన కూడా అదే స్టయిల్‌లో తెరకెక్కిస్తున్నట్టు ఈ ఫస్ట్ లుక్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో విడుదల చేసిన గ్లింప్స్ లో ప్రభాస్‌ రొమాంటిక్‌ బాయ్‌లా కనిపించారు. ఇప్పుడు రాజుల, హర్రర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కనిపిస్తున్నారు. దీంతో `చంద్రముఖి`తో పోలుస్తున్నారు నెటిజన్లు. 
 

ప్రభాస్‌ సరసన నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్‌ హర్రర్‌ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

ఈ బ్యానర్‌ నుంచి వరుసగా ఫ్లాప్‌ సినిమాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ అయినా వాళ్లకి హిట్‌ ఇస్తారా? అనేది చూడాలి. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న విడుదల చేయబోతున్నారు.  

Read more: కమెడీయన్‌ పక్కన చేయనని తెగేసి చెప్పిన సౌందర్య, చివరికి ఐటెమ్‌ సాంగ్‌ చేయాల్సిన పరిస్థితి

Also read: సిల్క్ స్మిత చనిపోయినప్పుడు హాజరైన ఏకైక స్టార్‌ హీరో ఎవరో తెలుసా? ఆయన రాక వెనుక అసలు కథ ఇదే!
 

Latest Videos

click me!