గే లాగా నటించాలని ప్రభాస్ ని ఇబ్బంది పెట్టిన డైరెక్టర్.. తనకి ఇష్టం లేకపోయినా..

Published : Apr 08, 2024, 04:38 PM IST

ప్రభాస్ తన కెరీర్ లో అన్ని రకాల చిత్రాల్లో నటించాడు. లవ్, యాక్షన్, పీరియాడిక్ డ్రామా, జానపదం ఇలా అన్ని చిత్రాల్లో ప్రభాస్ నటించాడు. కొన్ని ప్రయోగాలు కూడా ఉన్నాయి. 

PREV
16
గే లాగా నటించాలని ప్రభాస్ ని ఇబ్బంది పెట్టిన డైరెక్టర్.. తనకి ఇష్టం లేకపోయినా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ప్రభాస్ నటించే చిత్రాలన్నీ వందల కోట్ల బడ్జెట్ లో తెరక్కుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ప్రభాస్ ఎంత స్థాయికి ఎదిగినా ఆ కూల్ యాటిట్యూడ్, సింప్లిసిటీ అలాగే ఉంది. 

 

26

ప్రభాస్ తన కెరీర్ లో అన్ని రకాల చిత్రాల్లో నటించాడు. లవ్, యాక్షన్, పీరియాడిక్ డ్రామా, జానపదం ఇలా అన్ని చిత్రాల్లో ప్రభాస్ నటించాడు. కొన్ని ప్రయోగాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చక్రం చిత్రం కూడా ఉంది. చక్రం మూవీ ఎమోషనల్ గా సాగే మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం. 

 

36

అప్పట్లో ఈ చిత్రం ఆడియన్స్ కి ఎక్కలేదు. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ చక్రం మూవీ గురించి హాట్ కామెంట్స్ చేశారు. మీ కెరీర్ లో కష్టంగా అనిపించిన సీన్ ఏంటి అని అడగగా ప్రభాస్ బదులిచ్చాడు. చక్రం చిత్రంలో ఓ సీన్ లో గే లాగా నటించాల్సి వచ్చింది. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. 

 

46

కానీ డైరెక్టర్ కృష్ణ వంశి చేయమని చెప్పడంతో తప్పలేదు. క్యారెక్టర్ కి అవసరం కాబట్టి ఏదో చేయాలని చేశాను తప్ప నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని ప్రభాస్ తెలిపాడు. ఫ్యామిలీస్ ఇబ్బంది పడే సన్నివేశాల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు. 

 

56

ఏది కూడా మోతాదు మించి పోకూడదు. రొమాంటిక్ సీన్స్ లో నటించేటప్పుడు కూడా నాకు చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ సినిమాకు అవసరమైనంత రొమాన్స్ చేసేందుకు రెడీ అని అప్పట్లోనే ప్రభాస్ తెలిపాడు. 

 

66

ప్రస్తుతం ప్రభాస్ కల్కి లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సమ్మర్ లోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కి దక్కిన హిట్ సలార్ మాత్రమే. కల్కి చిత్రాన్ని దర్శకుడు నాగవంశీ అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories