రాధే శ్యామ్ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు రాజమౌళి స్వయంగా ముందుకు వచ్చారు. ప్రభాస్, రాజమౌళి మధ్య ఉన్న సాన్నిహిత్యం అలాంటిది. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్, రాజమౌళి ఇద్దరూ చాలా ఆసక్తికర అంశాలు చర్చించుకున్నారు. రాధే శ్యామ్ చిత్రంలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడిగా నటిస్తున్నాడు. చేతి గీతల్ని భవిష్యత్తుని, జాతకాన్ని కచ్చితంగా అంచనా వేయగలడు. దీనితో ప్రభాస్ రోల్ పై అందరిలో ఆసక్తి పెరిగింది.