అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన `డెకాయిట్` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఇది రవితేజ, శర్వానంద్ చిత్రాలను దాటేయడం విశేషం.
అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా `డెకాయిట్` మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ శుక్రవారం ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. శానిల్ డియో దర్శకత్వం వహించిన ఈ మూవీని సుప్రియా, సునీల్ నారంగ్ నిర్మించారు. ఇందులో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం మంచి అంచనాల మధ్య విడుదలయ్యింది. అయితే యావరేజ్ నుంచి, ఎబౌ యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం ఊహించని విధంగా సందడి చేస్తోంది. తొలి రోజు మంచి వసూళ్లని రాబట్టింది.
24
డెకాయిట్ కలెక్షన్లు
అడవి శేష్ సినిమాలంటే మినిమమ్ గ్యారంటీ అనే పేరుంది. పైగా ఆయన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో అలరిస్తూ వచ్చారు. కానీ `డెకాయిట్`తో తన జోనర్ దాటి ప్రయోగం చేశారు. లవ్ ఎమోషనల్, యాక్షన్ మేళవింపుగా ఈ మూవీని చేశారు. దీనికి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే వసూళ్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. ఈ సినిమా మొదటి రోజు రూ.13.57 కోట్ల వరకు వసూళ్లని రాబట్టినట్టు పలు బాక్సాఫీసు సైట్లు వెల్లడించాయి. ఇందులో ఇండియాలో ఏడున్నర కోట్లు, ఓవర్సీస్‌లో సుమారు ఆరు కోట్ల వరకు సాధించినట్టు సమాచారం. ఓవరాల్‌గా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పదమూడు కోట్లకుపైగా గ్రాస్ సాధించినట్టు తెలుస్తోంది.
34
రవితేజ, శర్వానంద్ సినిమాలకు షాక్
ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం `డెకాయిట్` సినిమా కలెక్షన్లని అధికారికంగా ప్రకటించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ.16కోట్లు రాబట్టినట్టు వెల్లడించింది. ఓవర్సీస్‌లో బాక్సాఫీసుని షేక్ చేస్తుందని టీమ్ తెలిపింది. అక్కడ మొదటి రోజు 5లక్షల 75వేల డాలర్లు రాబట్టింది. ఇదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రం మొదటి రోజు ఊహించని వసూళ్లని రాబట్టిందని చెప్పొచ్చు. ఈ విషయంలో ఇటీవల కాలంలో వచ్చిన రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి`, శర్వానంద్ నటించిన `నారీ నారీ నడుమ మురారి` చిత్రాలను కూడా దాటేయడం విశేషం. ఈ సినిమాలు మొదటి రోజు కేవలం ఐదు కోట్లు మాత్రమే రాబట్టాయి. ఇప్పుడు అడవి శేష్ వారి సినిమాలకు దాటేయడం విశేషం. ఇది ఆయన కెరీర్‌లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్‌గా చెప్పొచ్చు. అడవి శేష్ నటించిన `మేజర్` మూవీ మొదటి రోజు రూ.13కోట్లు రాబట్టింది. ఇప్పుడు దాన్ని `డెకాయిట్` దాటేసింది.
`డెకాయిట్` మూవీకి మొత్తంగా రూ.62కోట్ల బడ్జెట్ అయినట్టు సమాచారం. ఇక దీనికి థియేట్రికల్‌గా రూ.32కోట్ల వ్యాపారం జరిగింది. ఏపీ, తెలంగాణలో రూ.19కోట్లకు సేల్ కాగా, మిగిలిన ఇండియాలో రూ.5కోట్లు, ఓవర్సీస్‌లో ఆరు కోట్లకు అమ్ముడు పోయింది. అయితే ఓవర్సీస్‌లో ఈ మూవీ ఈ ఈవెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ కాబోతుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.33కోట్ల షేర్ రావాలి. రూ.65కోట్ల గ్రాస్ రావాల్సి ఉంది. ఇదే జోరు చూపిస్తే, మొదటి వీకెండ్‌తోపాటు, మొదటి వారంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పొచ్చు. అయితే శనివారం నుంచి దీనికి ఎలాంటి స్పందన ఉంటుందనేది చాలా కీలకం. అదే ఈ సినిమా భవిష్యత్‌ని నిర్ణయించనుంది.