Prabhas: ప్రభాస్‌ ఎప్పటికీ మర్చిపోలేని కృష్ణంరాజు చెప్పిన మాట ఇదే.. అది గుర్తొస్తే ఇప్పటికీ టెన్షన్‌

Published : Oct 22, 2026, 02:12 PM IST

ప్రభాస్‌ మొదట్లో తాను హీరో అవ్వాలనుకోలేదట. సడెన్‌గా ఆ ఆలోచన వచ్చిందట. అయితే మొదటి సినిమా షూటింగ్‌ టైమ్‌లో కృష్ణంరాజు ఒక మాట చెప్పారట. అది తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు ప్రభాస్‌.

PREV
14
సినిమాల్లోకి రావాలనుకోలేని ప్రభాస్‌

ప్రభాస్‌ సినిమాల్లోకి రావడం చాలా యాధృచ్చికంగా జరిగింది. ఆయన సినిమాల్లోకి రావాలని, హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదు. పెద్దనాన్న కృష్ణంరాజు హీరో అయిన, నాన్న సూర్యనారాయణ రాజు నిర్మాత అయినా, ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణమే ఉన్నా ఆయనకు సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. స్కూల్ డేస్‌లో పెద్దయ్యాక జాబ్‌ చేయాలని, ఏదైనా వ్యాపారం చేసుకోవాలని ఉండేది. తప్ప హీరో అవ్వాలని అనుకోలేదని తెలిపాడు ప్రభాస్‌.

24
సడెన్‌గా హీరో కావాలనుకున్న ప్రభాస్‌

అప్పట్లోనే ప్రభాస్‌ చాలా పొడవుగా ఉండేవాడట. దీంతో ఫ్రెండ్స్ అంతా హీరో హీరో అనేవారట. స్కూల్‌లో 9వ తరగతి వరకు చదువుపై పెద్దగా ఆసక్తి లేదని, కానీ టెన్త్ క్లాస్‌లోనే చదువుపై ఆసక్తి వచ్చిందని, ఫ్రెండ్స్,సినిమాలేవి గుర్తు రాలేదని, పుస్తకాల పురుగుగా చదివానని తెలిపాడు ప్రభాస్‌. కాలేజీకి వచ్చాక చదువు తగ్గి ఫ్రెండ్స్ పెరిగారట. డిగ్రీలో బీకాం చేశాడట. అలా సాగుతున్న సమయంలో సడెన్‌గా సినిమాల్లోకి రావాలనే ఆలోచన వచ్చిందట. సడెన్‌గా హీరో అవుతానని ఇంట్లో చెప్పాడట. ఇంట్లో వాళ్లు మొదట్లో షాక్‌ అయ్యారు. ఆ తర్వాత ఓకే అన్నారు. వైజాగ్‌ సత్యానంద్‌ వద్ద శిక్షణ ఇప్పించారు.

34
పెదనాన్న కృష్ణంరాజు చెప్పిన మాట

ఆ సమయంలోనే నిర్మాత అశోక్‌ కుమార్‌..`ఈశ్వర్‌` కథతో వచ్చారు. తనే హీరోగా అంటే మొదట భయమేసిందట. కానీ ఇంట్లో వాళ్లు ఒప్పించడంతో చేశాడట. అయితే ప్రారంభంలో చాలా టెన్షన్‌ పడ్డాడట ప్రభాస్‌. ఆ సమయంలో పెద్దనాన్న ఒక మాట చెప్పారట. సినిమాలో నటించే ప్రతి సీన్‌ ఒక చరిత్ర. జీవితాంతం ఉండిపోతుంది. దాన్ని చెరపలేం, దాన్ని ఎంతో మంది చూస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా నటించాలని, బాగా చేయాలని చెప్పారట. ఆ మాట తన జీవితంలో మర్చిపోలేనని తెలిపారు ప్రభాస్‌. అది తనని తరచూ టెన్షన్‌ కి గురి చేస్తుందన్నారు.

44
నాన్న హగ్‌ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని ప్రభాస్‌

మొదటి సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. `ఈశ్వర్‌` రిలీజ్‌ అయ్యింది. ముందుగా ఫ్యామిలీ అంతా కలిసి చూశారు. తెరపై తనని తాను చూసుకున్నప్పుడు థ్రిల్లింగ్‌గా అనిపించిందట. బాబోయ్‌ ఇదేంటి నేనేనా తెరపై ఇలా ఉంటానా అనిపించిందట. ఆ సినిమా చూశాక వాళ్ల నాన్న తనని హగ్‌ చేసుకొని బాగుందిరా అన్నాడట. ఆ మాట కూడా ఎప్పటికీ మర్చిపోలేను అని తెలిపారు ప్రభాస్‌. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ `ఫౌజీ`, `స్పిరిట్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories