Prabhas: హోంబలే బ్యానర్‌లో ప్రభాస్‌ మరో భారీ మూవీ.. డైరెక్టర్‌ ఎవరో తెలిస్తే వాహ్‌ అనాల్సిందే.. లోకేష్‌ కాదు

Published : Mar 14, 2025, 07:43 PM IST

Prabhas: ప్రభాస్‌ చేతిలో ఇప్పటికే మూడు, నాలుగేళ్లకి సరిపడ సినిమాలున్నాయి. ఇప్పుడు మరో సినిమా ఓకే అయ్యిందట. హోంబలే వాళ్లతో ఆ దర్శకుడు అడ్వాన్స్ ఇప్పించాడట. ఆ కథేంటో చూద్దాం. 

PREV
15
Prabhas: హోంబలే బ్యానర్‌లో ప్రభాస్‌ మరో భారీ మూవీ.. డైరెక్టర్‌ ఎవరో తెలిస్తే వాహ్‌ అనాల్సిందే.. లోకేష్‌ కాదు
Prabhas

Prabhas: ప్రభాస్‌ సినిమాల లైనప్‌ చూస్తే ఎవ్వరైనా షాక్‌ అవ్వాల్సిందే. దాదాపు ఆరేడు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికే ఇంకా నాలుగైదు ఏళ్లు పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మించే అవకాశం ఉంది. మరి ఈ మూవీకి దర్శకుడెవరో చూద్దాం. 

25
the raja saab

ప్రభాస్‌ ప్రస్తుతం రెండు సినిమాలే చేస్తున్నారు. `ది రాజాసాబ్‌`, `ఫౌజీ` షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయ్యాక సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వంలో `స్పిరిట్‌` మూవీ చేయనున్నారు. అనంతరం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. వీటితోపాటు `సలార్‌ 2`, `కల్కి 2` సినిమాలు చేయాలి ప్రభాస్. అలాగే లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ ఓ సినిమాని తెరకెక్కించనుందని సమాచారం. 

35
prabhas

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమా ఓకే అయ్యిందట. హోంబలే ప్రొడక్షన్‌లోనే ప్రభాస్‌ మరో సినిమాకి కమిట్‌ అయ్యారట. ఈ లెక్కన ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ లో ప్రభాస్‌ నాలుగు సినిమాలు చేయబోతున్నారని చెప్పొచ్చు. అంటే ప్రభాస్‌ సగం సినిమాలు ఆ ప్రొడక్షన్‌ వద్దే ఉన్నాయి. ఓ రకంగా డార్లింగ్‌ వారి గుప్పెట్లో ఉన్నారని చెప్పాలి. 
 

45
Prabhas, Multi-Layered, Fauji, Hanu Raghavapudi

మరి హోంబలేలో లోకేష్‌ కనగరాజ్‌, ప్రశాంత్‌ వర్మ, ప్రశాంత్‌ నీల్‌తో సినిమాలు కాకుండా చేయబోతున్న కొత్త ప్రాజెక్ట్ ఏంటి? దీనికి దర్శకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఎవరో కాదు `ఫౌజీ` దర్శకుడు హను రాఘవపూడి అని తెలుస్తుంది. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో `ఫౌజీ` చిత్రీకరణ నడుస్తుంది. ఆర్మీ బ్యాక్‌ డ్రాప్‌లో వార్‌ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు హను. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంటుంది. 

55
Hanu Raghavapudi , Prabhas

ఈ క్రమంలో వీరి మధ్య అండర్‌స్టాండింగ్‌ బాగా కుదిరిందని, హను రాఘవపూడి మరో లైన్‌ చెప్పాడని, ప్రభాస్‌తో సినిమా చేయడానికి హను రాఘవపూడి హోంబలేతో డార్లింగ్‌కి అడ్వాన్స్ ఇప్పించారని సమాచారం. ఇందులో నిజమెంతా? నిజమైతే ఈ మూవీఎప్పుడు ఉంటుందనేది పెద్ద సస్పెన్స్. `ఫౌజీ`ని అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. 

read  more: నాగార్జున, మహేష్‌ బాబు కలిసి నటించాల్సిన మల్టీస్టారర్‌ ఏంటో తెలుసా? దర్శకుడు హ్యాండివ్వడంతో మిస్‌

also read: శోభన్‌ బాబు, జయలలితలా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన టాలీవుడ్‌ స్టార్ జోడీ ఎవరో తెలుసా? ఇప్పటికీ టచ్‌లోనే

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories