ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, బన్నీ, చిరు, నాగ్‌.. ప్రైవేట్‌ జెట్‌ విమానాలు కలిగిన టాలీవుడ్‌ స్టార్స్..

Published : Sep 20, 2022, 06:47 PM IST

మన టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలంతా లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తున్న వాళ్లై. వారిలో కొందరికి ఏకంగా ప్రైవేట్‌ జెట్‌ విమానాలు కూడా ఉండటం విశేషం. మరి జెట్‌ ఫ్లైట్స్ ఉన్న స్టార్స్ ఎవరో ఓ లుక్కేద్దాం. 

PREV
19
ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, బన్నీ, చిరు, నాగ్‌.. ప్రైవేట్‌ జెట్‌ విమానాలు కలిగిన టాలీవుడ్‌ స్టార్స్..

సినిమా సెలబ్రిటీలు లగ్జరీ లైఫ్‌ని ఇష్టపడుతుంటారు. ఆదాయం పెరగడం, స్టార్‌ ఇమేజ్‌ పెరగడంతో అందరిలా వారుఉండలేరు. సెలబ్రిటీ హోదా గడపాల్సిందే. ఇతరులతో పోటీ ఉంటుంది. ఇతర సెలబ్రిటీ కంటే మనం తక్కువ కాదనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే లగ్జరీ లైఫ్‌కి అలవాటుపడుతుంటారు. అదేసమయంలో లావిష్‌నెస్‌ని ఇష్టపడుతుంటారు. అందులో భాగంగా లగ్జరీ హౌజ్‌లు, కార్లు వంటి వాహనాలుగా చెప్పొచ్చు. లగ్జరీ వాహనాల్లో అత్యున్నతమైనది విమానాలను భావిస్తున్నారు. మన టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలంతా లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తున్న వాళ్లై. వారిలో కొందరికి ఏకంగా ప్రైవేట్‌ జెట్‌ విమానాలు కూడా ఉండటం విశేషం. మరి జెట్‌ ఫ్లైట్స్ ఉన్న స్టార్స్ ఎవరో ఓ లుక్కేద్దాం. 
 

29

టాలీవుడ్‌ లో అగ్ర హీరోలందరూ ప్రైవేట్‌ జెట్‌ని కలిగి ఉండటం విశేషం. వారిలో ముందుంటారు మెగా హీరోలు. చిరంజీవి ఫ్యామిలీకి సొంతంగా ఓ ప్రైవేట్‌ జెట్‌ విమానం ఉంది. కాకపోతే దీన్ని ఎక్కువగా రామ్‌చరణ్‌ వాడుతుంటారు. ఆయన తన ఫ్యామిలీతో కలిసి తన జెట్‌లో వెకేషన్‌కి వెళ్తుంటారు. ఆ మధ్య నిహారిక మ్యారేజ్‌కి కూడా వాళ్లు తమ సొంత జెట్‌లోనే ఉదయ్‌ పూర్‌కి వెళ్లారు. 
 

39

అలాగే అల్లు అర్జున్‌ కి కూడా సొంతంగా జెట్‌ ఫ్లైట్‌ ఉంది. ఆయన తన ఫ్యామిలీతో కలిసి చాలా సందర్భాల్లో తన సొంత ఫ్లైట్‌లో జర్నీ చేస్తూ కనిపించారు. ఆయన తమ జెట్‌ ఫ్లైట్‌ ముందు దిగిన ఫోటోలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే. 

49

అక్కినేని హీరోలకు సొంతంగా జెట్‌ ఫ్లైట్‌ ఉంది. నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ కలిసి చాలా సందర్భాల్లో ఈ విమానంలో ప్రయాణించారు. చాలా లగ్జరీగా అత్యాధునిక హంగులతో ఈ విమానం ఉందని తెలుస్తుంది.

59

పాన్‌ ఇండియాస్టార్‌ ప్రభాస్‌కి సొంతంగా ఓ విమానం ఉంది. దీన్ని ఆయన తరచూ వాడుతుంటారు. `బాహుబలి` తర్వాత దీన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఆయన ఈ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 
 

69

అలాగే సూపర్‌ స్టార్‌ మహేష్‌కి కూడా ప్రైవేట్‌ జెట్‌ ఉంది. వెకేషన్‌కి వెళ్లే టైమ్‌లో ఎక్కువగా మహేష్‌ ఈ జెట్‌నే వాడుతుంటారని సమాచారం. పలు మార్లు నమ్రత ఈ జెట్‌లో ప్రయాణిస్తున్న ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్న విషయం తెలిసిందే. 

79

నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్‌కి ప్రైవేట్‌ విమానం ఉందని సమాచారం. దీని విలువల ఎనబై కోట్లు అని టాక్‌. ఎమర్జెన్సీ సమయంలోనే తారక్‌ తన ఫ్లైట్‌ని వాడుతుంటారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

89

ఇంకోవైపు రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ కూడా ఓ ప్రైవేట్‌ జెట్‌ని కొన్నారని టాక్‌. ఆయన ఇటీవల జెట్‌లో ప్రయాణించారు. ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అది విజయ్‌ సొంతంగా కొనుగోలు చేసిందే అని సమాచారం. మరి ఇందులోనూ నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
 

99

మరోవైపు సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార కూడా ఇటీవల ఓ జెట్‌ని కొనుగోలు చేసిందట. ఇటీవల ఆమె ప్రైవేట్‌ జెట్‌లో ప్రయాణిస్తున్న ఫోటోలు వైరల్‌ అయ్యాయి. ఇటీవలే నయనతార ఆస్తులు వివరాలు వైరల్‌ అయ్యాయి. ఇందులో జెట్‌ కూడా ఉందని, దీని విలువల సుమారు ఇరవై కోట్లకుపైగానే ఉంటుందని సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories