ప్రభాస్‌ పెట్టుకునే వాచ్‌ కలెక్షన్ల ధరలు తెలిస్తే ఫ్యూజుల్‌ ఔటే.. మామూలోడికి లైఫ్‌ సెటిల్‌మెంటే!

ప్రభాస్‌ లగ్జరీ లైఫ్‌కి కేరాఫ్‌. రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చిన డార్లింగ్‌.. తన లైఫ్‌ స్టయిల్‌ కూడా అంతే లగ్జరీగా ఉంటుంది. ఆయన వాడే ప్రతిదీ బ్రాండ్‌ అయి ఉంటుంది, అంతేకాదు అత్యంత కాస్ట్లీగానూ ఉంటుంది. 
 

prabhas luxury watch collection if you know price fuses out it life settlement for common man arj

ప్రభాస్‌(Prabhas) ఇప్పుడు ఇండియన్‌ సినిమాకి ప్రతిరూపం. తెలుగు సినిమాని గ్లోబల్‌ కి పరిచయం చేసిన సూపర్‌ స్టార్‌. అత్యధిక పారితోషికం అందుకునే ఇండియన్‌ హీరో. కృష్ణంరాజు నటవారసత్వాన్ని అందుకుని 21ఏళ్ల క్రితం(2002)లో `ఈశ్వర్‌` సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు. అప్పుడెవరూ ఊహించలేదు.. ప్రభాస్‌ గ్లోబల్‌ స్టార్‌ అవుతాడని, ఆయన కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు, తాను ఈ రేంజ్‌కి వెళ్తానని, కానీ ఇండియాలో ఏ హీరో అందుకోని అరుదైన ఘనతని ప్రభాస్‌ సాధించారు. 
 

21ఏళ్లలో ఆయన 21 సినిమాలు చేశారు. ఇందులో `వర్షం` సినిమా బ్రేక్‌ ఇచ్చింది. `ఛత్రపతి` మూవీ స్టార్‌ని చేసింది. `డార్లింగ్‌`, `మిస్టర్‌ పర్‌ఫెక్ట్`లతో విజయాలు అందుకుని `మిర్చి` చిత్రంతో తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఇక `బాహుబలి`తో పాన్‌ ఇండియా స్టార్‌ నుంచి గ్లోబల్‌ స్టార్‌గా రీచ్‌ అయ్యాడు. ఇండియన్‌ సినిమాకి ఫేస్‌ అయ్యాడు. ఆయన కెరీర్‌లో కేవలం ఆరు సినిమాలు మాత్రమే హిట్‌. మిగిలిన వాటిలో `బిల్లా` లాంటి చిత్రాలు ఫర్వాలేదనిపిస్తే, చాలా వరకు పరాజయం చెందాయి. కానీ ప్రభాస్‌ అరుదైన రికార్డులు క్రియేట్‌ చేస్తున్నారు. 
 


బాహుబలి తర్వాత ఆయన నటించిన చిత్రాల రేంజ్‌ పెరిగింది. డిజాస్టర్‌ చిత్రాలు కూడా మూడు వందలు, నాలుగు వందల కోట్ల కలెక్షన్లు చేస్తుండటం విశేషం. `సాహో` నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుని   350కోట్లకుపైగానే కలెక్షన్లని సాధించింది. `రాధేశ్యామ్‌` డిజాస్టర్‌ రూ.250కోట్లు చేసింది. `ఆదిపురుష్‌` డిజాస్టర్‌ రూ.400కోట్లు రాబట్టింది. ఆయన సినిమాల బడ్జెట్‌లో భారీగా ఉండటంతో అవి పెద్ద నష్టాలను తెస్తున్నాయి. కానీ మామూలు బడ్జెట్‌లో చేసి ఉంటే అవి కూడా హిట్‌ కేటగిరిలోకి వచ్చేవనే చెప్పొచ్చు. అది ప్రభాస్‌ రేంజ్‌కి నిదర్శనమని చెప్పొచ్చు.
 

Image: Our Own

ప్రభాస్‌ ది రాజుల ఫ్యామిలీ. ఆయన అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్‌ రాజు. స్క్రీన్‌ నేమ్‌ని ప్రభాస్‌గా మార్చుకున్నారు. నిర్మాత సూర్యనారాయణ రాజు,శివకుమారీలకు జన్మించారు. ముగ్గురు సంతానంలో చిన్నవాడు. సోదరుడు ప్రబోద్, సోదరి ప్రగతి ఉన్నారు. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు పెదనాన్న అవుతారు. వీరిది రాజుల ఫ్యామిలీ కావడంతో అప్పట్నుంచే వందల ఎకరాల భూమి ఉంది. లగ్జరీ లైఫ్‌కి కేరాఫ్‌. అందుకే డార్లింగ్‌ లైఫ్‌ స్టయిల్ చాలా లగ్జరీగా ఉంటుంది.

అంతేకాదు చేసే సహాయం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. పెద్ద చేయి అంటుంటారు. గ్రాండియర్‌కి, లావిష్‌కి కేరాఫ్‌గా నిలిచే ప్రభాస్‌.. ధరించే వాచెస్‌ కూడా టూ కాస్ల్టీగా ఉండటం విశేషం. నేడు ప్రభాస్‌ (అక్టోబర్‌ 23) పుట్టిన రోజు. 44వ బర్త్ డే (Prabhas BirthDay)సెలబ్రేట్‌ చేసుకున్న ప్రభాస్‌ ధరించే వాచ్‌ కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం. 

ప్రభాస్‌.. ధరించే ప్రతి ఒక్క వాచ్‌ ధర (Prabhas Watchs) లక్షల్లో ఉంటుంది. ఆయన వాడే వాటిలో ఒకట హుబ్లక్‌ సాంగ్‌ బ్లూ ఆల్‌ బ్లాక్‌ వాచ్‌ ఒకటి. ఇదొక వెరైటీ బ్రాండ్‌ వాచ్‌. దీని ధర తెలిస్తే మాత్రం మైండ్‌ బ్లాక్‌ అవుతుంది. దీని కాస్ట్ ఏకంగా 14లక్షలు ఉంటుంది. దీంతోపాటు ఇదే కంపెనీకి చెందిన హుబ్లక్‌ సాంగ్‌ బ్లూ వైట్‌ కూడా ఉంది. దీని ధర 13 లక్షలు కావడం విశేషం. 
 

మరోవైపు.. తక్కువ కాస్ట్ వాచ్‌ కూడా ప్రభాస్‌ వాడారు. గతంలో ఆయన సుమారు నాలుగు లక్షల ఖరీదు చేసే బెల్‌ అండ్‌ రాస్‌ బీఆర్‌ 03-92 మోడల్‌ వాచ్‌ కూడా ఉంది. దీన్ని ఆయన గతంలో వాడేవారు. అలాగే `లూయిస్‌ వూట్టాన్‌ టాంబోర్‌ రెగట్టా నేవీ` వాచ్‌ని సైతం ప్రభాస్‌ వాడారు. బాహుబలి సమయంలో దీన్ని ధరించారు. దీని విలువల మూడు లక్షల వరకు ఉంటుంది. ఆయన వాడే వాచ్‌లో ఇదే తక్కువ కాస్ట్ వాచ్‌ అని చెప్పొచ్చు. 
 

అలాగే అత్యంత కాస్ల్టీ వాచ్‌.. రోలెక్స్ కాస్మోగ్రాఫ్‌ డేటోనా 18సీటీ గోల్డ్ వాచ్‌ని కూడా ఆయన ధరించారు. ఇటీవల కాలంలో ఈ వాచ్‌ని ప్రబాస్‌ ఎక్కువగా వాడుతున్నారు. దీని విలువ తెలిస్తే మైండ్‌ బ్లో అనాల్సిందే. దీని ధర ఏకంగా 26 లక్షలు ఉండటం విశేషం. 

దీని మించిన మరో వాచ్‌ కూడా ప్రభాస్‌ ధరిస్తున్నారు. రోలెక్స్ యాచ్‌ మాస్టర్‌ 11 గోల్డ్ వాచ్‌ కూడా ప్రభాస్‌ వద్ద ఉంది. దీని విలువ ఏకంగా 29లక్షలు కావడం విశేషం. ఇలా ఈ వాచ్‌ల కలెక్షన్లు అన్ని కలిపితే దాదాపు కోటి విలువ చేస్తాయని తెలుస్తుంది. ఇది మామూలు వ్యక్తులకు లైఫ్‌ సెటిల్‌మెంట్‌ మ్యాటర్‌గా చెప్పొచ్చు. పేదవాడు జీవితాంతం రిచ్‌గా బతికేస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అది మన ప్రభాస్‌ రేంజ్‌. అంతేకాదు లగ్జరీ కార్లు, కోట్ల విలువ చేసే హౌజ్‌, ఫామ్‌ హౌజ్‌ కూడా ఆయనకు ఉన్నాయి. 
 

ప్రభాస్‌ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. `సలార్‌` మూవీ డిసెంబర్‌ 22న విడుదల కాబోతుంది. ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపు నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో `కల్కి` మూవీలో నటిస్తున్నారు. ఇందులో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది రాబోతుంది. మరోవైపు మారుతి దర్శకత్వంలో ఓ కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ చేస్తున్నారు. ఇవి కాకుండా సందీప్‌రెడ్డి వంగాతో, అలాగే హిందీలో `వార్‌` సిరీస్‌ మూవీ చేయబోతున్నారు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

Latest Videos

vuukle one pixel image
click me!