ఒక సినిమాను తీయడం కంటే కూడా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కష్టం. సినిమా సక్సెస్ లో ప్రమోషన్స్ పాత్ర కీలకం అనేది ఒప్పుకోవాల్సిన నిజం. టీజర్, ట్రైలర్ చూశాక ఆడియన్స్ సినిమా పట్ల ఒక అభిప్రాయానికి వస్తారు. సినిమా ఇలా ఉండబోతుంది అనే అంచనాతో థియేటర్స్ కి వెళతారు. ఈ అంచనాల విషయంలో అటూ ఇటూ అయితే ప్రేక్షకులు నిరాశ చెందే అవకాశం ఉంది.