టాలీవుడ్‌లో అత్యంత సంపన్నుడు ప్రభాస్‌.. ఆయన ఆస్తులెన్నో తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే?

Published : Oct 23, 2022, 10:53 AM IST

ప్రభాస్‌ ఇప్పుడు ఇండియా వైడ్‌గా మారుమోగే పేరు. ఇండియన్‌ సినిమాకి ప్రతిబింబంగా నిలుస్తున్నారు ప్రభాస్‌. అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగానూ నిలుస్తున్నారు ప్రభాస్‌. అయితే ఆయన ఆస్తుల వివరాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
17
టాలీవుడ్‌లో అత్యంత సంపన్నుడు ప్రభాస్‌.. ఆయన ఆస్తులెన్నో తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే?

కృష్ణంరాజు నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని ఇప్పుడు ఇండియన్‌ సినిమా గర్వించే స్థాయికి ఎదిగాడు ప్రభాస్‌. ప్రస్తుతం భారతీయ సినిమాలో ఆయనొక సంచలనం. ఒక్కో సినిమాకి వంద కోట్ల నుంచి 150కోట్ల పారితోషికం అందుకుంటున్న ఏకక హీరోగా నిలిచారు డార్లింగ్‌. తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌తో దూసుకుపోతున్న రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టిన రోజు నేడు(అక్టోబర్‌ 23). 1979, అక్టోబర్ 23న ప్రభాస్‌ జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన 43వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. 
 

27

ఈ సందర్భంగా ప్రభాస్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్‌ పై ప్రస్తుతం దాదాపు మూడు-నాలుగు వేల కోట్ల వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆయన మూడు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. `ఆదిపురుష్‌`, `సలార్‌`, `ప్రాజెక్ట్‌ కే` చిత్రాలున్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి నాలుగైదు వందల కోట్లతో తెరకెక్కుతున్నాయి. ఈ మూడు సినిమాల బడ్జెట్‌ వేయ్యి కోట్లు అని చెప్పొచ్చు. 
 

37

దీంతో ఒక్కో సినిమాపై వెయ్యి కోట్ల నుంచి, 1500కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో బరిలోకి దిగబోతున్నాయి. ఈ లెక్కన ఈ మూడు సినిమాలపై సుమారు నాలుగువేల కోట్ల వ్యాపారం జరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. దీంతో ప్రభాస్‌ పేరుతోనే ఓ మిని ఇండస్ట్రీ రన్‌ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

47

మరోవైపు ప్రభాస్‌ బర్త్‌ డే సందర్భంగా ఆయన ఆయన ఆస్తుల వివరాలు. ప్రభాస్‌ ఫ్యామిలీ రాజుల కుటుంబానికి చెందిన విషయం తెలిసిందే. వందల, వేల ఎకరాలు వారి ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వచ్చాయని తెలుస్తుంది. పెదనాన్న కృష్ణంరాజు సహకారంతో ప్రభాస్‌ నాన్న సత్యనారాయణరాజు నిర్మాతగా రాణించారు. ఆయన గోపీకృష్ణ మూవీస్‌పై పలు సినిమాలను నిర్మించారు. 

57

నిర్మాతగానే కాదు, ఆయన వ్యాపారిగానూ రాణించారు. వీరికి ఒక గ్రానైట్‌ ఫ్యాక్టరీ ఉందని తెలుస్తుంది. దీనికితోడు హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు వంటి పలు ప్రధాన నగరాల్లో ఫామ్‌ హౌజ్‌లున్నాయి. మరోవైపు థియేటర్‌ రంగంలోనూ ఉన్నారు. వీటికితోడు వందల ఎకరాల పంటపొలాలు, కొబ్బరి తోటలున్నాయి. హైదరాబాద్‌ శివారులో వందల ఎకరాల్లో ఓ ఫారెస్టే ఉంది. సొంతూరులో వేల ఎకరాలున్నాయని సమాచారం. 

67

కృష్ణంరాజు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు నలుగురు కుమార్తెలే. అబ్బాయిలు లేరు. దీంతో ప్రభాసే వారికి కొడుకుగా భావిస్తుంటారు. కృష్ణంరాజు ఫ్యామిలీ బాధ్యత కూడా ప్రభాసే తీసుకుంటున్నారు. కృష్ణంరాజుకి సైతం వందల ఎకరాలు భూములు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, ఫామ్‌ హౌజ్‌లు, తోటలున్నాయి. ఇప్పుడు అవన్నీ ప్రభాస్‌కే చెందుతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

77

లాంబోర్గిని అవెంటేడర్‌ రోడస్టర్ కారు, రోల్స్ రాయిస్‌ ఫాంటమ్‌ కారు, ల్యాండ్‌ రోవర్‌, రేంజ్‌ రోవర్‌ కార్లు, జాగ్వర్‌ ఎక్స్ ఎల్‌, బీఎండబ్ల్యూ ఎక్స్ 3 కార్లున్నాయి. వీటి కాస్ట్ సుమారు పది కోట్లకుపైగానే ఉంటుందని తెలుస్తుంది. హైదరాబాద్‌ శివారులో ఇప్పుడు ఓ ఫామ్‌ హౌజ్‌ కట్టిస్తున్నారు ప్రభాస్‌. ఇలా మొత్తంగా ప్రభాస్‌ ఆస్తులు ఏడు నుంచి ఎనిమిది వేల కోట్లు ఉంటాయని సోషల్‌ మీడియా సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories