చీరకట్టులో ప్రభాస్ హీరోయిన్, కుందనపు బొమ్మ నిధి అగర్వాల్.. వైరల్ ఫోటోషూట్

Published : Jan 16, 2026, 05:59 PM IST

వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది  నిధి అగర్వాల్. రీసెంట్ గా చీరకట్టులో గ్లామరస్ లుక్‌తో సందడి చేసింది.  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ  ఫోటోలకు లైకులు వెల్లువెత్తుతున్నాయి.

PREV
14
ఇస్మార్ట్ శంకర్ తో మారిపోయిన ఇమేజ్..

వరుస సినిమాలతో దూసుకుపోతోంది స్టార్ హీరోయిన్  నిధి అగర్వాల్. తెలుగులో ఆమె సినిమాలు చాలా ఉన్నా.. ఇస్మార్ట్ శంకర్ మూవీతో బాగా ఫేమస్ అయ్యింది. ఆతరువాత కొంత కాలం అవకాశాలు రాలేదు.. కానీ ఈమధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తోంది బ్యూటీ. 

24
సీనియర్ హీరోల సరసన అవకాశాలు

రీసెంట్ గా  ప్రభాస్ 'రాజా సాబ్' సినిమాలో నటించి మెప్పించింది నిధి అగర్వాల్. అంతకు ముందు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాలో కూడా అద్భుతం చేసింది. వరుసగా సీనియర్ హీరోలు సరసన అవకాశాలు సాధిస్తోంది బ్యూటీ. 

34
ఇన్ స్టాలో 3 కోట్ల మంది ఫాలోవర్స్..

తెలుగు తమిళ ఇండస్ట్రీలో నిధి అగర్వాల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువే. నిధి అగర్వాల్ ఇన్ స్టాగ్రామ్ కు దాదాపు 3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నిధి ఇచ్చే అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. 

44
చీరకట్టులో మెరిసిపోయిన నిధి

అభిమానుల కలల రాణి నిధి అగర్వాల్, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామరస్‌గా పోజులిచ్చిన ఫోటోలను పోస్ట్ చేసింది. బ్లూ శారీలో నిధిని చూసి.. అభిమానులు అద్బుతం అంటున్నారు. ఈఫోటోలకు వేలల్లో లైకులు వెల్లువెత్తుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories