ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ నుంచి భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. సమంత దారిలోనేనా?

Published : Jan 17, 2022, 09:48 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ చర్చనీయాంశంగా మారింది. ఆమె తన సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి భర్త కళ్యాణ్‌ దేవ్‌ పేరుని తొలగించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆటు సోషల్‌ మీడియాలో, ఇటు ఫిల్మ్ నగర్‌లో వైరల్‌గా అవుతుంది.

PREV
17
ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ నుంచి భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. సమంత దారిలోనేనా?

చిరంజీవి(Chiranjeevi) తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని రారాజు. కొన్నేళ్లపాటు టాలీవుడ్‌ని ఏలిన మెగాస్టార్‌. ఆయన్ని మించిన అగ్ర నటుడు  ఇప్పుడు మరొకరు లేరంటే అతిశయోక్తి లేదు. అయితే ఫ్యామిలీ విషయంలో కాస్త డిస్టర్బ్ అవుతూ వస్తున్నారు. తన చిన్న కూతురు శ్రీజ(Sreeja) విషయంలోనే బాగా ఇబ్బందికి గురయ్యారు. ఇప్పుడు మరోసారి శ్రీజ వార్తల్లో నిలుస్తుంది. ఆమె సోషల్‌ మీడియాలో పేరు మార్చడం దుమారం రేపుతుంది.

27

Chiranjeevi చిన్న కూతురు Sreeja తన సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి తన భర్త కళ్యాణ్‌ దేవ్‌ పేరు తొలగించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. `sreeja_kalyan` గా ఉన్న శ్రీజ.. ఇప్పుడు  తన పేరుని `sreejakonidela`గా మార్చుకుంది. దీన్ని గమనించి నెటిజన్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. చిరంజీవి కూతురు సోషల్‌ మీడియా  అకౌంట్లలో తన పేరుని మార్చుకుందని చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు. దీంతో శ్రీజ ఉన్నట్టుండి వార్తల్లోకి వచ్చారు. 
 

37

శ్రీజ తన భర్త పేరుని తొలగించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. కళ్యాణ్‌ దేవ్‌కి తనకు మధ్య ఏం జరిగిందనేది ఆరా తీసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో అనేక రూమర్స్ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. శ్రీజ, కళ్యాణ్‌ దేవ్‌ మధ్య రిలేషన్‌ చెడిందా ? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు  నెటిజన్లు. 
 

47

శ్రీజ.. 2007లో శిరీష్‌ భరద్వాజ్‌ని  ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల  తర్వాత తన  భర్త హెరాస్‌ చేస్తున్నాడని కేసు పెట్టిన శ్రీజ  ఆయనతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2016లో ప్రైవేట్‌ సెర్మనీలో కళ్యాణ్‌ దేవ్‌ని వివాహం చేసుకుంది. అమెరికాలో సెటిల్‌ అయిన తెలుగు ఫ్యామిలీకి చెందిన అబ్బాయి   కళ్యాణ్‌ దేవ్‌ కావడం విశేషం. వీరిద్దరి మ్యారేజ్‌ తర్వాత వీరికి కూతురు  నవిష్క జన్మించారు. 

57

అయితే గత కొన్ని రోజులుగా వీరి రిలేషన్‌కి సంబంధించిన రూమర్స్ ఊపందుకున్నాయి. ఏదో గొడవలవుతున్నాయనే గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు శ్రీజ తన పేరులో కళ్యాణ్‌ పేరుని తొలగించడం ఆ రూమర్లకి బలాన్ని చేకూర్చినట్టయ్యింది. వీరిద్దరు విడిపోబోతున్నారా? అనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. ఎందుకంటే గతంలో నాగచైతన్యతో విడిపోవడానికి ముందు సమంత కూడా తన  సోషల్‌ మీడియా  అకౌంట్ల నుంచి అక్కినేని అనే పదాన్ని తొలగించింది. ఈ రూమర్స్ కొన్ని రోజులపాటు కొనసాగాయి. రూమర్స్ ని నిజం చేస్తూ అక్టోబర్‌ 2న విడిపోతున్నట్టు వాళ్లిద్దరు ప్రకటించారు. మరి శ్రీజ విషయంలో ఏం జరగబోతుందో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు. 

67

దీనికితోడు.. ప్రస్తుతం కళ్యాణ్‌ దేవ్‌ అమెరికాలో ఉన్నారు. ఆయన చాలా రోజుల క్రితమే అమెరికా వెళ్లిపోయారు. శ్రీజ విషయంలో ఇష్యూ కారణంగానే ఆయన అమెరికా వెళ్లిపోయాడనే టాక్‌ కూడా వినిపిస్తుంది.  సంక్రాంతి  సందర్భంగా కళ్యాణ్‌ దేవ్‌ నటించిన `సూపర్‌ మచ్చి` చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమా ప్రమోషన్‌ కి కూడా కళ్యాణ్‌ రాలేదు. దీంతో ఎప్పుడు విడుదలయ్యిందనే విషయం కూడా తెలియకుండానే రిలీజ్‌ అయ్యింది.
 

77

మరోవైపు ఈ చిత్రానికి మెగా ఫ్యామిలీ ఎలాంటి సపోర్ట్ అందించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీజ, కళ్యాణ్‌ విడిపోతున్నారా? అనే రూమర్స్ తెరపైకి వచ్చారు. నెటిజన్లు ఇదే అనుమానాలను ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి విషయంలో ఏం జరుగుతుందో గానీ ఇప్పుడిది మాత్రం పెద్ద  దుమారం రేపుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories