Prabhas: కృష్ణంరాజు ముఖం చూసి ప్రభాస్ ని వదిలేయమంది నా భార్య, చాలా హర్ట్ అయ్యా.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు

Published : May 15, 2026, 07:09 AM IST

తనకి తొలి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నిర్మాతపై ప్రభాస్ పొరపాటున నోరు జారడట. దీనితో నిర్మాత హర్ట్ అయ్యారు. ప్రభాస్ తో సినిమా చేయకూడదు అని డిసైడ్ అయ్యారు. కానీ నిర్మాత భార్య రాజీ కుదిర్చింది. 

PREV
15
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. ప్రభాస్ నటించే సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో వేలకోట్ల బిజినెస్ చేస్తున్నాయి. ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. తొలి రెండు చిత్రాలు జస్ట్ ఓకె అనిపించాయి. కానీ ప్రభాస్ కి ఫస్ట్ బ్రేక్ లభించింది మాత్రం వర్షం మూవీతోనే.

25
వర్షం మూవీ

ఈ చిత్రం ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు నిర్మించారు. ఈ చిత్రం ప్రారంభం అయ్యే సమయంలో జరిగిన సంఘటనని ఎంఎస్ రాజు ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రభాస్ తో వర్షం సినిమా ప్రారంభించాలి అని అనుకున్నాం. ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నేను చేస్తున్న సినిమా అది. ఏ హీరో అయినా నా నిర్మాణంలో నటించాలంటే అదృష్టంగా భావిస్తారు.

35
ప్రభాస్ కి నచ్చలేదు, నోరు జారాడు

వర్షం చిత్రానికి నేను శోభన్ ని దర్శకుడిగా ఎంపిక చేశా. కానీ ప్రభాస్ కి నచ్చలేదు. కుర్రతనమో ఏమో కానీ ఒక మాట నోరు జారాడు. శోభన్ ని తీసుకోవడం సరైన నిర్ణయమేనా అని నన్ను అడిగాడు. ప్రభాస్ సినిమాని ఒక బాధ్యతగా తీసుకుని అన్నీ ప్లాన్ చేస్తున్నా. ఆ విషయం ప్రభాస్ కి అర్థం కాలేదు. అయినా ఆ మాట అన్నాడు. రెండు మూడు సార్లు అన్నాడు. దీనితో నాకు హర్టింగ్ గా అనిపించింది. దీనితో నేను కోపంతో సరే ప్రభాస్ మనం ఇంకో సినిమా చేద్దాం లే అని చెప్పి వెళ్ళిపోయా.

45
ప్రభాస్ తండ్రి నుంచి ఫోన్

రెండు మూడు రోజులు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత ప్రభాస్ ఫాదర్ సూర్య నారాయణ రాజు ఫోన్ చేశారు. మా అబ్బాయి ఏదో తెలియక అనేశాడు. పట్టించుకోవద్దు. మీ ఇంటికి మా అబ్బాయి వస్తున్నాడు మాట్లాడండి అని చెప్పారు. ప్రభాస్ ఇంటికి వచ్చాడు. మా వైఫ్ టిఫిన్ పెట్టింది. కాఫీ కూడా ఇచ్చింది. అప్పటికీ ప్రభాస్ అన్న మాటతో నేను కన్విన్సింగ్ గా లేను.

55
కృష్ణంరాజు ముఖం చూసి వదిలేయండి

ఏం కాదులే ప్రభాస్, దీనిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంకో సినిమా చేద్దాం లే అని చెబుతున్నా. లోపల ప్రభాస్ పై కోపం ఉన్నప్పటికీ అతనంటే నాకు ఇష్టం. కృష్ణంరాజు గారి ఫ్యామిలీ నుంచి ఒక పెద్ద స్టార్ రావాలి అని కోరుకునేవాడిని. ఇంతలో నా భార్య నన్ను లోపలికి పిలిచింది. మీరు ప్రభాస్ ని ఏమీ అనొద్దు. ప్రభాస్ చిన్న వాడు. కృష్ణం రాజు, సూర్య నారాయణ రాజు ముఖం చూసి వదిలేయండి. ప్రభాస్ తో సినిమా చేయండి అని చెప్పింది. బయటకి వచ్చి ఆయన నీతో సినిమా చేస్తాడులే ప్రభాస్, టెన్షన్ వద్దు అని చెప్పింది. ఆ రోజున ప్రభాస్ కి నాకు మధ్య మంచి అండర్ స్టాండింగ్ కుదిరింది. నేను ఏం చెబితే అది కాదనకుండా ప్రభాస్ చేశాడు అని ఎంఎస్ రాజు అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories