Prabhas Baahubali Re Release For Special Occasion in telugu
Baahubali: ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన మూవీ “బాహుబలి 1”. రాజమౌళి సత్తా ఏంటో ప్రపంచానికి చూపించిన సినిమా. ప్రభాస్ ను ఇండియన్ స్టార్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా రిలీజై పదేళ్లు అవుతున్నా నిన్న మొన్న రిలీజైనట్లుగా ఉంటుంది.
ఇప్పటికీ టీవీల్లో వస్తే టీఆర్పీలు అదిరిపోతూంటాయి. ఈ క్రమంలో ఈ చిత్రం రీరిలీజ్ కు ప్లాన్ చేసారు నిర్మాతలు. రీసెంట్ గా మహేష్ బాబు చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీరిలీజ్ తో ఆ ట్రెండ్ మళ్లీ ఊపందుకుంది.
అలాగే సలార్-1 రీ రిలీజ్ కు అడ్వాన్స్ బుకింగ్స్ వారం నుంచే దుమ్ము లేపాయి. ఈ క్రమంలో బాహుబలి 1 చిత్రం రీరిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
Prabhas Baahubali Re Release For Special Occasion in telugu
బాహుబలి సినిమా రీరిలీజ్ విషయాన్ని సోషల్ మీడియాలో పదే పదే అభిమానులు అడగ్గా.. ఎట్టకేలకు నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ఈ ఏడాదిలోనే బాహుబలి-1, బాహుబలి-2ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పేశారు.
బాహుబలి-1 వచ్చి జులై నాటికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అప్పుడే రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. బాహుబలి 1 రీ రిలీజ్ అయితే ఇప్పటి వరకు ఉన్న పాన్ ఇండియా సినిమా రికార్డులన్నీ బద్దలైపోతాయంటూ కామెంట్లు పెడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.
Prabhas Baahubali Re Release For Special Occasion in telugu
బాహుబలి 1 చిత్రం 2015 జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ తేదీ నుంచి సరిగ్గా పది సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఈ 2025లో అదే డేట్ కి విడుదల అయ్యే అవకాసం ఉంది.
దీంతో ఈ స్పెషల్ డేట్ లో వచ్చే ఈ చిత్రం ఇపుడు ఉన్న రీరిలీజ్ ట్రెండ్ లో డెఫినెట్ గా భారీ రికార్డులు సెట్ చేయవచ్చు అని చెప్పవచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. బాహుబలి 1 ది బిగినింగ్ ని పదేళ్ల యానివర్సరీ పండగను ఫ్యాన్స్ భారీ గా జరుపుకోవటానికి సన్నాహాలు సోషల్ మీడియా సాక్షిగా మొదలెట్టేసారు.