ఇదేం పని రా బాబు.. ప్రభాస్-అనుష్కకి పెళ్ళి చేసి..పిల్లల్ని కూడా పుట్టించిన ఫ్యాన్స్, వైరల్ అవుతున్న ఫోటోస్.

First Published | Oct 6, 2023, 5:05 PM IST

ప్రభాస్ ఎలాగు పెళ్లి వార్త చెప్పడంలేదు అనుకుంటున్నారేమో ఏమో.. ఫ్యాస్ ఇక ఆగలేకపోయారు.. ప్రభాస్ కుపెళ్ళి చేయడమే కాదు.. భార్యా పిల్లలతో ఉన్న ఫోటోలు వైరల్ చేస్తున్నారు. 
 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్ కు. ఆయన సినిమాల కోసం  అభిమానులు ఎంతో ఆశగా ఎదరుచూస్తుంటారు. అయితే ఆయన సినిమాల మాట అటు ఉంచితే.. ప్రభాస్ పెళ్ళి కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 40 ఏళ్ళు దాటినా ఆయన పెళ్ళి చేసుకోలేదు. అంతే కాదు ఆయన తో పాటు.. హీరోయిన్ అనుష్క కూడా 40 ఏళ్లు దాటినా పెళ్ళి పీటలేక్కలేదు. అయితే  ప్రభాస్ మాత్రం పెళ్లి అనే మాట కూడా ఎత్తకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. 

అయితే ప్రభాస్ పెళ్ళిపై రకరకాల వార్తలు ఇప్పటికే వైరల్ అవుతూ వచ్చాయి.  ప్రభాస్ పెళ్లి పై అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అనుష్క శెట్టి, కృతి సనన్ తో ప్రేమ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతే కాదు అనుష్కను ఆల్ రెడీ పెళ్లి చేసుకున్నాడని.. ఫారెన్ లో ఇల్లు కూడా కొన్నారంటూ.. వార్తలు వైరల్ అయ్యాయి.  కానీ వాటిలో నిజం లేదని.. ప్రభాస్ తో పాటు ఆ ఇద్దరు తారలు కూడా పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. 
 


వాళ్లు ఎంత క్లారిటీ ఇచ్చినా కాని.. రూమర్స్ మాత్రం ఏమాత్రం ఆగలేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటీ అంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ లో మాత్రం  ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆశ పడుతుంటారు. అంతే కాదు వీరిద్దరి ఫోటోలు కలిపి ఫ్యాన్ మేడ్ పిక్స్ వైరల్ చేస్తుంటారు. అప్పట్లో పెళ్ళి చేసుకున్నారు అన్నట్టుగా ఫోటోలు క్రియేట్ చేసి పెట్టిన అభిమానులు ఈసారి మరో అడుగు వేశారు. 
 

ప్రభాస్ అండ్ అనుష్క కలిసి ఇప్పటికి నాలుగు సినిమాల్లో నటించారు. ఆన్ స్క్రీన్ ఈ జంట ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ బంధాన్ని చూసిన అభిమానులు.. వీరిద్దరూ కలిసి ఉంటే ఇంకా బాగుంటుందని ఆశ పడుతుంటారు. అయితే ప్రభాస్ పెళ్లి విషయమై ఏం చెప్పడం లేదని, అభిమానులు చేసిన పని అందరిని ఆశ్చర్యపరుస్తోంది. 

ఫ్యాన్స్ ఏం చేశారంటే.. గతంలో ప్రభాస్ అనుష్క పెళ్లి వరకే పరిమితం అయిన వారు.. ఈసారి అనుష్క, ప్రభాస్ తో పాటు ఓ బేబీ ఫోటో కూడా యాడ్ చేసి.. డైరెక్ట్ గా ఫ్యామిలీ ఫోటోనే రిలీజ్ చేశారు. ప్రస్తుతం బాగా అందుబాటులో ఉన్న AI టెక్నాలజీ ఉపయోగించి ఈ పనిచేశారు నెటిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సహాయం తీసుకోని అనుష్కతో ప్రభాస్ కి పెళ్లి చేసేశారు. అయితే పెళ్లితో మాత్రమే ఆగలేదు.. వారిద్దరికీ ఒక పాపని కూడా పుట్టించేశారు. 

ఇక ఈ అద్బుతం ప్రస్తుంతం సోసల మీడియాలో వైరల్ అవుతుంది. అది కూడా  #Pranushka పేరుతో హ్యాఫ్ ట్యాగ్ వైరల్ అవుతోంది. ఇలా అయినా వీరిద్దరు కలిస్తే బాగుండు అని అభిమానులు కోరకుంటున్నారు. అయితే వీరి క్రియేటివిటి చూసి.. అంతా ఆశ్చర్యపోవడంతో పాటు.. నవ్వుకుంటున్నారు.  మరి ఇవి ప్రభాస్ అనుష్క వరకూ వెళ్తాయా లేదా.. వారు స్పందిస్తారా లేదా చూడాలి. 
 

Latest Videos

click me!