Poorna : చీరకట్టు అందాలతో కట్టిపడేస్తున్న ‘పూర్ణ’.. ఎర్ర చీరలో ఏంజెల్ లా ఉంది..

First Published Jan 25, 2022, 5:04 PM IST

ఆర్టిస్ట్ గా, డ్యాన్సర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ( షమ్నా కాసీం) చీరకట్టుతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. తన అందచందాలతో  కుర్రాళ్ల చూపులను ఆకర్షిస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 

సినిమాల్లో మెరుస్తూనే, డ్యాన్స్ షోలకు జడ్జీగా వ్యహరించిన పూర్ణ ప్రస్తుతం సినిమాల పరంగా జోరు పెంచింది. ఆమెకి ఇప్పుడు ఓ రకంగా కమ్‌ బ్యాక్‌ అని చెప్పొచ్చు. గతంలో `అవును` సినిమా  హిట్‌తో క్రేజ్‌ని సొంతం చేసుకుని వరుస సినిమాలు చేసింది పూర్ణ. కానీ సరైన కథలను, పాత్రలను ఎంపిక చేసుకోవడంలో విఫలం కావడంతో కెరీర్‌ కాస్త గాడి తప్పింది. దీంతో చేసేదేమీ లేక  చిన్న సినిమాలకే పరిమితమయ్యింది. 
 

కానీ ఇటీవల ఆమె పలు భారీ సినిమాల్లో భాగమైంది. ఓ వైపు `తలైవి`, మరోవైపు `దృశ్యం 2`, ఇంకోవైపు బాలయ్య `అఖండ` చిత్రంలో వరుసగా కనిపించింది.  బ్యాక్‌ టూ బ్యాక్‌ ప్రేక్షకులను అలరించింది. మరోవైపు `సుందరి` అనే సినిమాలోనూ బోల్డ్ రోల్‌ చేసి ఆశ్చర్యపరిచింది. ఆమె నటించిన `తలైవి`, `దృశ్యం2`,  `అఖండ` చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా `అఖండ` బ్లాక్‌ బస్టర్‌ కావడంతో పూర్ణకి మంచి పేరొచ్చింది.  

ఈ సందర్భంగా పూర్ణ తన గ్లామర్ ఫొటోలను ఇటీవల సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో పూర్ణ, చాలా ఆకర్షణీయంగా ఉంది. చూస్తుంటే అయస్కాంతంలా ఆకర్షిస్తోంది పూర్ణ. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్యూటీ ఫుల్, గార్జియస్ అంటూ తమ అభిమాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 

కాగా, పెద్ద సినిమాల విజయాలతో అందరి చూపు ఇప్పుడు పూర్ణవైపు పడింది. స్పెషల్‌ రోల్స్ కి ఆమె కేరాఫ్‌గా  నిలుస్తున్నది.  మరోవైపు `ఢీ` షో సైతం పూర్ణకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దీంతో సుళభతరంగా  బుల్లితెర ఆడియెన్స్ కి దగ్గరైంది. 
 

దీంతో కేవలం సినిమా ఆడియెన్స్ మాత్రమే కాదు, టీవీ ఆడియెన్స్ కూడా  పూర్ణకు అభిమానులుగా మారారు. ఇలా ఆమె అటు సినిమాలకు ప్రాధాన్యత నిస్తూనే, మరోవైపు టీవీ షోలతో మరింత మంది అభిమానులను సంపాదించుకుంటోంది. తన పాపులారిటీని పెంచుకున్నారు. 

ప్రస్తుతం `ఢీ`14వ సీజన్‌ నుంచి తప్పుకుంది పూర్ణ.  ఆమెకి వరుసగా పెద్ద సినిమా  ఛాన్స్ లు వస్తున్న నేపథ్యంలో `ఢీ`కి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు షో నిరాహకులే ఆమెను దూరం పెట్టారనే టాక్‌ కూడా  వినిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం  పూర్ణకి పూర్వవైభవం తలపించేలా అవకాశాలు వస్తున్నాయి.   

click me!