Deepthi Sunaina:షణ్ముఖ్ ఎక్స్ లవర్ దీప్తి సునైన పై పుకార్లు.. ఫేక్ అంటూ సంచలన పోస్ట్ చేసిన బిగ్ బాస్ భామ!

Published : Jan 25, 2022, 04:36 PM ISTUpdated : Jan 25, 2022, 04:39 PM IST

యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైన (Deepthi Sunaina)తనపై ప్రచారం అవుతున్న పుకార్లను క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదంటూ కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. 

PREV
16
Deepthi Sunaina:షణ్ముఖ్ ఎక్స్ లవర్ దీప్తి సునైన పై పుకార్లు.. ఫేక్ అంటూ సంచలన పోస్ట్ చేసిన బిగ్ బాస్ భామ!

యూట్యూబర్ గా కేరీర్ ప్రారంభించిన దీప్తి సునైన అక్కడ ఫేమ్ తెచ్చుకున్నారు. దీనితో ఆమెకు బిగ్ బాస్ సీజన్ 2(Bigg Boss)లో పాల్గొనే అవకాశం దక్కింది. నాని హోస్ట్ గా 2018లో ప్రసారమైన షోలో ఆమె పాల్గొన్నారు. బిగ్ బాస్ షో తర్వాత దీప్తి సునైన ఇమేజ్ మరింతగా పెరిగింది. యూట్యూబ్ లో ఆమె వీడియోలకు డిమాండ్ పెరిగింది. 
 

26


మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ (Deepthi sunaina) తో దీప్తికి లవ్ అఫైర్ ఉంది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్, సిరీస్లులు, సాంగ్స్ లో కలిసి నటించిన వీరిద్దరూ ఒకరికి మరొకరు దగ్గరయ్యారు. ఇక తాము ప్రేమికులమంటూ ఓపెన్ గా చెప్పుకుతిరగారు ఈ జంట. కట్ చేస్తే 2022లో ఐదేళ్ల రిలేషన్ షిప్ కి బ్రేకప్ చెప్పారు. 

36


ఇటీవల దీప్తి సునైన అధికారికంగా షణ్ముఖ్ తో విడిపోతున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. నటి సిరి హన్మంత్ తో సన్నిహితంగా ఉంటున్న షణ్ముఖ్ చర్యలు నచ్చకే దీప్తి సునైన బ్రేకప్ చెప్పారని అందరూ అనుమానిస్తున్నారు. 

 

46

బిగ్ బాస్ బాస్ సీజన్ 5(Bigg boss telugu 5)లో పాల్గొన్న షణ్ముఖ్ మరో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సిరి హన్మంత్ తో రాసుకుపూసుకు తిరిగాడు. ఇద్దరూ హౌస్ లో ఒకరికి మరొకరు అన్నట్లు ఉన్నారు. హగ్స్, కిస్సెస్ వంటి రొమాంటిక్ చర్యలకు పాల్పడ్డారు. షణ్ముఖ్ చర్యలకు రగిలిపోయిన దీప్తి సునైన బ్రేకప్ చెప్పారనేది ప్రచారంలో ఉన్న సమాచారం.

56

బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో ఒకటి రెండు సార్లు దీప్తి ఫ్యాన్స్ కి టచ్ లోకి వచ్చారు. బ్రేకప్ మానసిక వేదనకు గురిచేసిందని ఒప్పుకున్న దీప్తి.. ఇకపై తన గురించి తాను ఆలోచించుకుంటానని, కెరీర్ పై దృష్టి పెడతానని అన్నారు. కాగా దీప్తి సునైనకు హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందంటూ ఓ రూమర్ బయటికి వచ్చింది.
 

66

 
దీంతో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన దీప్తి అంటూ వివిధ కథనాలు తెరపైకి వచ్చాయి. ఈ వార్తలకు దీప్తి సునైన క్లారిటీ ఇచ్చారు. సదరు వార్తలో ఎలాంటి నిజం లేదని, పూర్తిగా అవాస్తవం అంటూ తేల్చిపడేసింద. దీనితో హీరోయిన్ గా చూడాలన్న ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. 

Read more Photos on
click me!

Recommended Stories