Poonam Kaur: త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ డైరెక్ట్ అటాక్.. మా ఫ్యామిలీ బలహీనతని వాడుకున్నాడు, సంచలన ఆరోపణలు

Published : Oct 10, 2026, 11:58 AM IST

నటి పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఇన్‌స్టాగ్రామ్ లో నేరుగా సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తమ కుటుంబ బలహీనతను వాడుకుని బలవంతంగా స్టేట్‌మెంట్లు ఇప్పించారని అన్నారు.

PREV
15
Poonam Kaur

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి పూనమ్ కౌర్ మధ్య ఉన్న వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. గత కొంతకాలంగా త్రివిక్రమ్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్న పూనమ్ కౌర్, తాజాగా నేరుగా ఆయన పేరును ప్రస్తావిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ లో సంచలన ఆరోపణలు చేశారు.

25
ఎంతమంది జీవితాలు నాశనం కావాలి

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "త్రివిక్రమ్ శ్రీనివాస్ మా కుటుంబ బలహీనతను దుర్వినియోగం చేసుకుని, వారితో బలవంతంగా స్టేట్‌మెంట్ ఇప్పించారు - నేను దానికి స్పష్టంగా కట్టుబడి ఉండను. రాజకీయ నాయకులు చేసిన పనులకు మేము జవాబుదారీ కాదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బయటకు వెళ్లిపోయి, మళ్లీ వారికి సహాయం కావాలన్నప్పుడు మమ్మల్ని వాడుకోవడం ఆయన చేసిన అత్యంత దుర్మార్గమైన పని. 'మా' (MAA) అసోసియేషన్ ఆయనను ప్రశ్నించండి - మీరు ఎవరి కోసం వేచి చూస్తున్నారు? ఇంకా ఎంతమంది అమాయకుల జీవితాలు నాశనం కావాలి?" అంటూ పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు.

35
కుటుంబ బలహీనతపై ఘాటు వ్యాఖ్యలు

త్రివిక్రమ్ తన కుటుంబ బలహీనతను ఆసరాగా చేసుకుని, వారితో బలవంతంగా ప్రకటనలు చేయించారని పూనమ్ తీవ్రంగా ఆరోపించారు. తన కుటుంబంతో ఎన్ని స్టేట్‌మెంట్లు ఇప్పించినా తాను వాటికి ఎంతమాత్రం కట్టుబడి ఉండబోనని ఖరాకండీగా చెప్పుకొచ్చారు. అలాగే రాజకీయ నాయకులు చేసిన పనులకు తమ కుటుంబం జవాబు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

45
ఆపదలో తప్పుకోవడంపై ఆగ్రహం

సమస్య వచ్చినప్పుడు పక్కకు తప్పుకోవడం, మళ్లీ వారికి అవసరం వచ్చినప్పుడు తమను వాడుకోవడం త్రివిక్రమ్ చేసిన అత్యంత దుర్మార్గమైన పని అని పూనమ్ విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి.

55
'మా' అసోసియేషన్ మౌనంపై ప్రశ్నలు

ఈ వ్యవహారంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ('మా') మౌనాన్ని కూడా పూనమ్ కౌర్ తీవ్రంగా తప్పుపట్టారు. త్రివిక్రమ్‌ను 'మా' అసోసియేషన్ ఎందుకు ప్రశ్నించడం లేదని, ఇంకా ఎంతమంది అమాయకుల జీవితాలు నాశనం కావడం కోసం వేచి చూస్తున్నారని ఘాటుగా నిలదీశారు. అయితే పూనమ్ ఆగ్రహానికి అసలు కారణం తెలియరాలేదు. దీనిపై త్రివిక్రమ్ లేదా 'మా' స్పందిస్తారేమో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories