Poonam Kaur Comments : మెగాఫ్యామిలీపై పూనమ్ కౌర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమంటుందంటే..

Published : Mar 14, 2022, 11:35 AM IST

నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) తన కామెంట్లతో నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఆసక్తికర కామెంట్లు చేస్తూనే.. తెలివిగా తప్పించుకోవడంలో పూనమ్ మేటీ అని చెప్పొచ్చు. తాజాగా మెగా ప్యామిలీపై పూనమ్ కౌర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

PREV
16
Poonam Kaur Comments : మెగాఫ్యామిలీపై పూనమ్ కౌర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమంటుందంటే..

హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur) వివాదాల్లోనే, వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తుంది. ముఖ్యంగా పవన్‌ విషయంలో ఆమె చేసే కామెంట్లు తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంటాయి. తాజాగా మెగా ఫ్యామిలీపై  ఆమె చేసిన కామెంట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. 
 

26

పూనమ్‌ కౌర్‌(Poonam Kaur) చాలా కాలం తర్వాత తెలుగులో `నాతిచరామి` అనే సినిమా నటిస్తోంది. ఇటీవల పలు ఓటీటీల్లోనూ విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా బిజీగా గడుపుతోంది పూనమ్‌. వరుసగా ఇంటర్వ్యూలిస్తూ వార్తల్లో నిలుస్తుంది.
 

36

ఇందుకోసం తన మూవీ ప్రమోషన్స్ ఆడియెన్స్ కు రీచ్ కావాలనే ఉద్దేశంతో  స్టార్ హీరోలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది పూనమ్.  తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మెగా ఫ్యామిలీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది.
 

46

తొలుత పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan)ప్రస్తావన రావడంతో తన ముఖం ప్రకాశవంతంగా అయ్యింది. యాంకర్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫోటో చూపించగా, అంతకు ముందే పీకే లవ్స్ అని అనేసి పెద్దగా నవ్వేసింది. పీకే అంటే తనపేరేనని.. పీ అంటే పూనమ్.. కే అంటే కౌర్ (PK)అని అర్థమిచ్చి తెలివిని ప్రదర్శించింది.  
 

56

తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంటే తనకు చాలా గౌరవమని తెలిపింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గురించి చాలా విషయాలు తెలియజేయాలంది. కానీ మరో సందర్భంగా చెబుతానంటూ దాటవేసింది. 
 

66

ఇక తన కేరీర్ గురించి మాట్లాడుతూ ప్రారంభంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ వచ్చిందని.. కానీ తానే వద్దనుకున్నట్టు చెప్పింది. ప్రస్తుతం మరిన్ని చేయాలని ఉన్నట్టు  చెప్పుకొచ్చింది. ‘నాతిచరామి’ మూవీ రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతం చేసుకుంటోంది.
 

click me!

Recommended Stories