Poonam Kaur : పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమా.. ‘అడ్డుక్కోవాల్సిన అవసరం నాకు లేదు’.. పూనమ్ కౌర్ ఘాటు రిప్లై!

Published : Mar 17, 2024, 04:41 PM ISTUpdated : Mar 17, 2024, 04:44 PM IST

నటి పూనమ్ కౌర్ (Poonam Kaur)  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాపై ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది. తనపై వస్తున్న రూమర్లకు గట్టిగా బదులివ్వడం హాట్ టాపిక్ గ్గా మారింది.   

PREV
16
Poonam Kaur : పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమా.. ‘అడ్డుక్కోవాల్సిన అవసరం నాకు లేదు’.. పూనమ్ కౌర్ ఘాటు రిప్లై!

Tollywood హీరోయిన్ పూనమ్ కౌర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలపైనా, సోషల్ అంశాలపైనా స్పందిస్తూ ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. 
 

26

కొన్ని సందర్భాల్లో ఈమె ఘాటుగా రిప్లైలు ఇస్తూ... సెన్సేషనల్ గా కామెంట్స్ పెడుతూ నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారుతుంటారు. తన వెర్షన్ ను తెలియజేయడంతో ఏమాత్రం సంకోచించరు. 

36

ఈ క్రమంలో తాజాగా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘జల్సా’ (Jalsa Movie) తో తనను ముడిపెడుతూ వస్తున్న రూమర్లపై తాజాగా స్పందించింది. అసలు విషయం ఏంటో క్లారిటీ ఇచ్చింది. 
 

46

అయితే గతంలో  ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో పూనమ్ కౌర్ ను తీసుకోవాల్సి ఉందని, బదులుగా పార్వతీ మెల్టన్ ను తీసుకున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. 
 

56

దీనిపై తాజాగా పూనమ్ కౌర్ ఘాటుగా స్పందించింది. ‘జల్సా సినిమా రూమర్ల కథ నాకు వ్యతిరేకంగా తయారుచేసిన ఫేక్ స్టోరీ. ఇది నిజం కాదు. నేను లైఫ్ లో ఏ సినిమా కోసం ఏ దర్శకుడిని, నటుడిని అవకాశం అడగలేదు. 
 

66

నేను ఎల్లప్పుడూ ప్రత్యామ్నాయ జీవన మార్గాల కోసం వెతుకుతూ ఉంటాను. నేను చేసిన చిత్రాల కంటే తిరస్కరించిన చిత్రాల సంఖ్యనే ఎక్కువని నిర్మోహమాటంగా తెలియజేస్తున్నారు. దయచేసి తప్పుడు కథను నమ్మొద్దు’. అని ట్వీటర్ ద్వారా పేర్కొంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories