పూనమ్ బజ్వా తెలుగులో `మొదటి సినిమా`తో ఎంట్రీ ఇచ్చి, `ప్రేమంటే ఇంతే`, `బాస్`, `వేడుక`, `పరుగు`, `ఎన్టీఆర్ కథానాయకుడు` వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా తన ఇంపాక్ట్ ని చూపించింది. గ్లామర్ సైడ్ ఓపెన్ అయ్యాక ఆమెకి అవకాశాలు తగ్గాయి. ఆమె కూడా తెలుగుని లైట్ తీసుకుంది. ఇప్పుడు తెలుగులో నటించేందుకు ఎదురుచూస్తుంది. మరి ఈ బ్యూటీని తిరిగి ఏ మేకర్ తీసుకొస్తాడో చూడాలి.