ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. `హరిహర వీరమల్లు` చిత్రంలో ఆమె పవన్‌కి జోడీ కడుతుంది. దీంతోపాటు ఒకటి రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మరో మూడు కొత్త ప్రాజెక్ట్ లకు సైన్ చేసిందట. ఆ వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయని టాక్. ఇక సవ్యసాచి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ `మిస్టర్ మజ్ను`, `ఇస్మార్ట్ శంకర్`, `ఈశ్వరన్`, `భూమి`, `హీరో`, `కలగా తళైవన్` చిత్రాలు చేసింది. ఇప్పుడు పవన్‌తో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె పంచమీ అనే పాత్రలో కనిపించబోతుంది.