టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే తాజాగా ముంబైలోని తన ఇంటిని ఎలా డిజైన్ చేసుకుందో చూపించింది. ప్రతి గదిని స్టైలిష్ గా, అలాగే అట్రాక్టివ్ ఇంటీరియర్ తో నింపేసింది. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదలు ప్రతిదీ తన అభిరుచిగా తగట్టుగానే సెట్ చేయించుకుంది.
ఇప్పటికే మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా హోమ్ టూర్ ద్వారా తన ఇంట్లోని ప్రత్యేకతలను తెలియజేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బుట్టబొమ్మ ‘ఏషియన్ పెయింట్స్ వేర్ ది హార్ట్ ఈజ్ సీరీస్’ వీడియోలలో భాగంగా హోమ్ టూర్ చేసింది. తన ఇంటిలోని ఒక్కో స్పెషాలిటీని తెలియజేసింది.
ముందుగా పూజా ఇంటి ఎంట్రెన్స్ నుంచి వివరించడం మొదలుపెట్టింది. గ్రీన్ కలర్ లోని పెద్ద తలుపులను ఓపెన్ చేసి స్వాగతం పలికింది. డోర్ పై గోల్డ్ లెటర్స్ లో పూజా హెగ్దే అనే పేరును సెట్ చేయడం ఆకర్షణీయంగా ఉంది. ఇంట్లోనికి ఎంట్రీ కాగానే ఆరు టెబుల్స్ ఉన్న ఓ డైనింగ్ టేబుల్ ను చూడొచ్చు. ఆ గదికి అవతలి వైపున పాలరాతితో కూడిన ఓపెన్ కిచెన్ ఉంటుంది.
కిచెన్ లోని ఇంటీరియర్స్, లైటింగ్స్, టైల్స్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. అలాగే వంటగదికి రెండు స్లైడింగ్ డోర్స్ ఉండటం ప్రత్యేకంగా అనిపిస్తుంది. పొగ, ఘాటు రాకుండా ఇవి ఊపయోగపడుతాయి. ఓపెన్ కిచెన్ గానూ కనిపిస్తుంది. కిచెన్ లో తన నచ్చిన బ్లూ కలర్ ను పెయింట్ చేయించినట్టు తెలిసింది. ముఖ్యంగా వైట్ బ్యాక్ స్ప్లాష్, హ్యాంగింగ్ లైట్స్ ఇష్టమని, నైట్ టైమ్ లో ఆ లైట్స్ వెలుతురు కనువిందుగా ఉంటాయంది.
ఇక తన లివింగ్ రూమ్ నూ అట్రాక్టివ్ పెయింటింగ్, స్టైలిష్ మెటీరియల్, ఫంక్షనల్ డిజైనింగ్ తో ఆకర్షణీయంగా సెట్ చేయించింది. ఇక అక్కడి సోఫాలకు ఉన్న పింక్ కవర్స్ ఆకట్టుకుంటున్నాయి. పూజా హెగ్దేకు పింక్, వైట్ కలర్ ఇష్టం కావడంతో గదిలో చాలా వరకు ఆ రంగులోనే డిజైన్స్ ఉంటాయని తెలిపింది.
పూజా హెగ్దేకు తన ఇంటిలో చాలా ఇష్టమైన ప్లేస్ తన బెడ్ రూమ్. అందులోనూ ఓ కారిడార్ అంటే మరీ ఇష్టమని చెప్పింది. అక్కడే తను స్ఫూర్తి పొందిన సినిమాల పోస్టర్లను రెండువైపులా గోడలకు మొత్తం ఏర్పాటు చేసింది. వాటిని చూసినప్పుడల్లా తనకు ఎనర్జి వస్తుందని చెప్పింది. ఆ ప్లేస్ తనకు ఫెవరేట్ అని వివరించింది.
బెడ్‌రూమ్ నూ ఆహాల్లాదకరమైన ప్రదేశంగా మార్చుకుంది.
ఖరీదైన బెడ్, స్పెషల్ ఇంటీరియర్స్ తో పాటు ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా ఉండటం విశేషం. తన బెడ్ రూమ్ లోనే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువ సమయం గడుపుతారని చెప్పింది. విదేశాలకు వెళ్లిన సందర్భాల్లో తనకు నచ్చిన డిజైన్లను కూడా ఇంటిలో సెట్ చేయించినట్టు తెలిపింది. కాలుకు గాయం కావడంతో ఇటీవలె కోలుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘సర్కాస్’,‘కిసీ కా భాయ్ కిసి కా జాన్’, తెలుగులో మహేశ్ బాబు సరసన ‘ఎస్ఎస్ఎంబీ28’లో నటిస్తోంది.