Khiladi:ర‌వితేజ 'ఖిలాడీ' మూవీ రివ్యూ

First Published | Feb 11, 2022, 2:31 PM IST


కోవిడ్ ఎఫెక్టు తో గ‌త ఏడాదిలోనే విడుద‌ల కావాల్సిన ‘ఖిలాడి’ వాయిదా పడి.. ఇన్నాళ్లకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్‌ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి.  ర‌వితేజ న‌ట‌న‌తో డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రి గ్లామ‌ర్, టేకింగ్, మేకింగ్ అన్నీ మాస్ కు దగ్గరగా అనిపించాయి. మరి సినిమా ఎలా ఉంది.

రవితేజకు తను చేయబోయే పాత్రల నుంచి జనం ఏమి ఎక్సపెక్ట్ చేస్తారో...మాగ్జిమం తన సినిమాల్లో అవన్నీ ఉండేలా చూసుకుంటాడు. రిస్క్ లేకుండా సేఫ్ గేమ్ ఆడుతూ ప్రయోగాలకు దూరంగా ఉంటూ కెరీర్ ని క్రాక్ తో మరోసారి పట్టాలు ఎక్కించి నెట్టుకొస్తున్నాడు. అయితే ఆ క్రాక్ తర్వాత రవితేజ సినిమా అంటే ఖచ్చితంగా భారీ ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. దానికి తోడు ట్రైలర్ కూడా బాగానే కిక్ ఇచ్చింది. పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ప్రి రిలీజ్ తో అది ఇంకాస్త పెర‌గాల్సింది పోయి..కాస్త త‌గ్గింది. ర‌వితేజ మాట‌ల్లో సినిమాపై తొలిసారి నెగిటీవ్ వైబ్రేష‌న్స్ క‌నిపించాయి. దాంతో ఈ సినిమాపై కొన్ని డౌట్స్ ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో రిలీజైన సినిమా ఎలా ఉంది..పాజిటివ్ బజ్ కు తగ్గట్లుగా భలే ఉందనిపించుకుందా ...లేదా తేడా కొట్టేసిందనే రూమర్స్ నిజమయ్యాయా రివ్యూలో చూద్దాం.

కథ

 మోహ‌న్ గాంధీ త‌న అత్త మామ‌లు (ముర‌ళీ శ‌ర్మ‌, అన‌సూయ), భార్య అదితి (డింపుల్ హ‌య‌తి)ల‌ను దారుణంగా హ‌త్య కేసులో సెంట్రల్ జైల్లో ఉంటాడు  మోహన్ గాంధీ (రవితేజ). తన థీసెస్ నిమిత్తం అతని దగ్గరకు వస్తుంది క్రిమినాలజీ స్టూడెంట్ పూజ (మీనాక్షి). ఆమె అతను చెప్పిన ఎమోషనల్ కథ విని తన తండ్రి ఇంటెలిజెన్స్ డీజీపీ (స‌చిన్ ఖేడేక‌ర్‌)  సంతకం పోర్జరీ చేసి బెయిల్ ఇప్పించి బయిటకు తీసుకు వస్తుంది. అయితే అతను బయిటకు వచ్చాక....అతనో ఇంటర్నేషనల్ క్రిమినల్ అని తెలుస్తుంది. మరో ప్రక్క పదివేల కోట్ల మనీ మిస్సింగ్ కేసుని ఛేదించటానికి రంగంలోకి దూకాడు సిబీఐ ఆఫీసర్ భరద్వాజ (అర్జున్). క్లూలను ట్రాక్ చేస్తూ మోహన్ గాంధీ (రవితేజ) దగ్గరకు వస్తాడు. అసలు మోహన్ గాంధీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి... గాంధీకి అంత భారీ మనీ లాండరింగ్ కేసుకు సంభంధం ఏమిటి...మధ్యలో సీఎం అవ్వాలని హోం మినిస్టర్   (ముఖేష్ రుషి) వేసిన ప్లాన్ ఏంటి.  దానికి ఈ మనీ లాండరింగ్ కేసు కు ఉన్న లింకేంటి? అతను భార్య చిత్ర (డింపుల్) ఏమైంది...అసలు, ఆ పదివేల కోట్లు ఎవరివి? ఎక్కడ ఉన్నాయి? మోహన్ గాంధీని మళ్లీ పోలీసులు పట్టుకున్నారా? లేదా?  వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

(ఇలాంటి ట్విస్ట్ బేస్ కథలనూ పూర్తిగా ఓపెన్ చేసి చెప్పలేము)



విశ్లేషణ

కథ పూర్తిగా ప్యాసివ్ మోడ్ లో నడుస్తుంది. ఇంటర్వెల్ దగ్గర ఓ ట్విస్ట్ పెట్టుకుని అక్కడ దాకా కామెడీ అనుకునే సీన్స్ ,కొద్దిపాటి యాక్షన్ ఎపిసోడ్స్ , పండని లవ్ సీన్స్  తో కాలక్షేపం చేసారు.అసలు కథలోకి ఇంటర్వెల్ లోకి వచ్చారు. అక్కడ నుంచి అయినా కథ,కథనం పరుగెడతాయా అంటే అడుగడుక్కి అర్దం లేని ట్విస్ట్ లు అడ్డుపడతాయి. ఇది ఏ జానర్ సినిమానో అర్దం కాదు. కాసేపు క్రైమ్ థ్రిల్లర్ లా, మరికాసేపు ఏదో యాక్షన్ కామెడీలా మారిపోతూంటుంది. అలాగే కథ కూడా ఎటు నుంచి ఎటు వెళ్తుందో క్లారిటీ ఉండదు. హీరో చేయటానికి ఏమీ ఉండదు. ఎంతసేపూ డైరక్టర్ పాయింటాఫ్ లో కథ నడిపి ట్విస్ట్ లతో మాయ చేయాలనే తాపత్రయం కనపడుతుంది.  జైల్లో రవితేజ చెప్పే ఎమోషనల్ ఫేక్ స్టోరీ వింటున్న మనకు నమ్మబుద్ది కాదు . అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరోలకు అయితే ఇలాంటి కథలు ఇబ్బంది ఉండదు కానీ తనకంటూ ఓ క్రేజ్ క్రియేట్ చేసుకున్న రవితేజ లాంటి వాళ్ళకు సరిపడే కథనం కాదు ఇది.


రవితేజ పాత్రను  ఫాలో అవుదామంటే డైరక్టర్ ఎక్కడక్కడ బ్రేక్ లు వేసేస్తాడు. పోనీ అర్జున్, రవితేజ మధ్యా గేమ్ లా కథ నడుస్తుందా అంటే అదీ ఉండదు. చాలా సీన్స్ లో రవితేజ దొరికిపోయేడు కదా అరెస్ట్ చేస్తాడు అనుకుంటాం..ఎందుకు వదిలేస్తాడో తెలియదు. క్లైమాక్స్ లో అయినా మనకి అన్ని లింక్ లు ఓపెన్ చేసి క్లారిటీ ఇస్తారేమో అనుకుంటే....అక్కడా సిల్లీగా ముగించేసి, సీక్వెల్ కు లీడ్ ఇస్తారు. స్క్రిప్టులో కానీ, డైరక్షన్ లో కానీ ఎక్కడా ఖిలాడీ తనం, స్మార్ట్ నెస్ కనపడదు.  ఫస్టాప్ ని  రవితేజ మార్క్ తో ఫస్టాఫ్ నడిపాలని ప్రయత్నించారు. ఆ కామెడీ సీన్స్ ఏమీ వర్కవుట్ కాలేదు. సెకండాఫ్ అయితే దారుణమే. అయినా  అసలు ఇలాంటి సిల్లీ కథకి అన్ని సబ్ ప్లాట్స్, క్యారక్టర్స్, ట్విస్ట్ లు అవసరమా అధ్యక్ష్యా. 


ఎవరెలా చేసారు

అప్పటికీ  ర‌వితేజ ఒంటిచేత్తో `ఖిలాడీ` ని న‌డిపించే ప్రయత్నం చేశాడు. త‌న బాడీ లాంగ్వేజ్ తో ఎప్ప‌టిలానే జోష్ నింపే ప్రయత్నం చేసాడు. లుక్ ప‌రంగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే బాగుండేది. ఎంత దాచినా వ‌య‌సు పెరుగుతుంద‌న్న విష‌యం దాగటం లేదు. దానికి తోడు డీఐ కూడా చాలా పూర్ గా చేయించారు. హీరోయిన్స్ కి అయితే సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలే లేవు.అర్జున్ ఇలాంటి పాత్ర చాలా సార్లు చేసిందే. ప్రత్యేకంగా చేసేందుకు ఏమీ లేదు..చెయ్యలేదు.   ర‌వితేజ – అర్జున్ మ‌ధ్య సాగే స‌న్నివేశాలు ఈ సినిమాకి కీల‌కంగా నిలవాలి కానీ ఆ స్దాయిలో లేవు.  

టెక్నికల్ గా చూస్తే...

దేవిశ్రీ ప్రసాద్ పాట‌లు మాములుగా ఉన్నాయి. రెండు పాటలు అదీ ఈ బోర్ సినిమాలో రిలీఫ్ ఇచ్చాయి.  మాస్ కు కాస్త ఎక్తుతాయి. పాటలతో పోలిస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరకొట్టాడనే చెప్పాలి. విషయంలేని  చాలా స‌న్నివేశాల్ని ఎలివేట్ చేశాడు దేవి. అయితే.. కొన్ని చోట్ల‌.. ఏమీ లేకుండా ఇందుకు ఇంత స్కోర్ ఇస్తున్నాడని, శ్రుతిమించిన‌ట్టు అనిపిస్తుంది. కెమెరా వర్క్, నిర్మాత పెట్టిన, ఖ‌ర్చు.. ఇవ‌న్నీ సినిమాకి రిచ్ లుక్ అద్దాయి. రమేష్ వర్మ  ఓ పార్సికల్ యాక్షన్  క‌థ‌ని,  రియాక్షన్ లేని స్క్రీన్ ప్లేతో రాసుకుని … మాస్‌కి  కొన్ని సీన్స్ రాసుకుని  ర‌వితేజ‌తో అది చేయించేశాడు. కొన్ని యాక్ష‌న్‌సీన్లు, దానికిచ్చిన ఎలివేష‌న్లు బాగా పండినా.. ఈ సినిమాలో అసలు విషయం లేక తడబడి..పడిపోయింది. అయితే సినిమా మొత్తం దర్శకుడు చాలా స్టైలిష్ గా slick గా తెరకెక్కించాడు.ఎడిటర్ కు కథ ఏమీ అర్దం కాలేదో ఏమో కానీ  చాలా కన్ఫూజ్ గా తయారు చేసాడు.
 


హైలెట్స్
ఇటలీ బైక్ ఛేజ్ సీన్  
రవితేజ
మాస్ సాంగ్స్
ప్రీ ఇంటర్వెల్ సీన్
ప్రొడక్షన్ వాల్యూస్
 

మైనస్ లు

స్క్రీన్ ప్లే
దర్శకత్వం
విసుగెత్తించే ట్విస్ట్ లు
రన్ టైమ్

ఫైనల్ థాట్

ఇది ఖిలాడి కాదు...ప్రేక్షకులపై నిర్దాక్ష్యణంగా చేసిన దాడి

---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2


తెర వెనక ...ముందు

నటీనటులు: రవితేజ, మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి, అనసూయ, మురళీ శర్మ, ముఖేష్ రుషి, సచిన్ ఖేడేకర్, ఠాకూర్ అనూప్ సింగ్, రావు రమేష్ తదితరులు
పాటలు: శ్రీమణి
మాటలు: శ్రీకాంత్ విస్సా, సాగర్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సమర్పణ: జయంతి లాల్ గడ
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
దర్శకత్వం: రమేష్ వర్మ
Run Time:2 hr 34 Mins
విడుదల తేదీ: ఫిబ్రవరి 11, 2022

ఎప్పటిలాగానే మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja)పెర్ఫామెన్స్ కు మంచి మార్కులు పడుతున్నాయి. రవితేజ్ మార్క్ డైలాగ్స్.. ఆయన మార్క్ మ్యానరిజంతో దూసుకుపోయాడంటున్నారు ఆడియన్స్. అటు ఈ సినిమాలో నటించిన సీనియర్ నటుడు అర్జున్ (Arjun) పర్ఫామెన్స్ కు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఆయన ఏ పాత్ర చేసినా.. తన పర్ఫామెన్స్ తో అదరగొడతాడంటున్నారు ఫ్యాన్స్.

మరికొంత మంది మాత్రం ఫస్ట్ వన్ అవర్ సినిమా అదరగొటిందంటున్నారు. సినిమాను బ్రతికించడానికి ఈ వన్ అవర్ చాలంటున్నారు మరికొంతమంది ఆడియన్స్.  ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఊహించలేం.. అంత అద్భుతంగా ఉంది అంటూ ట్వీట్ చేస్తున్నారు ఖిలాడి చూసిన ఫారెన్ ప్రేక్షకులు.

రవితేజ(Ravi Teja), మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతీ జంటగా.. రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కింది ఖిలాడి సినిమా. ఈరోజు (ఫిబ్రవరి  11)న ఈ సినిమా రిలీజ్ అవ్వగా.. అంతకంటే ముందు ఓవర్ సిస్ లో ప్రిమియర్ రిలీజ్ అయిపోయింది ఖిలాడి సినిమా. ఈ మూవీ చేసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు తెలియ చేస్తున్నారు.

Latest Videos

click me!