Pooja Hegde: ఐరన్ లెగ్ ఆఫ్ ది ఇయర్... బుట్టబొమ్మ పూజాను త్రివిక్రమే కాపాడాలి

Published : Dec 24, 2022, 07:13 PM IST

అదృష్ట దేవత కాస్తా ఐరన్ లెగ్ అయ్యింది. వరుస హిట్స్ తెచ్చిన పూజా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఇస్తున్నారు. ఆమె లేటెస్ట్ రిలీజ్ సర్కస్ సైతం ప్లాప్ టాక్ తెచ్చుకోగా పూజా ఖాతాలో ఐదో ప్లాప్ పడింది.   

PREV
17
Pooja Hegde: ఐరన్ లెగ్ ఆఫ్ ది ఇయర్... బుట్టబొమ్మ పూజాను త్రివిక్రమే కాపాడాలి
Pooja Hegde

2021 వరకు పూజా కెరీర్(Pooja Hegde) రాకెట్ వేగంతో దూసుకుపోయింది. అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో మొదలైన ఆమె వీరవిహారం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వరకు సాగింది. మహర్షి, అల వైకుంఠపురంలో ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. లక్కీ హీరోయిన్ ట్యాగ్ తో సౌత్ టు నార్త్ దున్నేసింది. ఎప్పటి నుండో హిట్ లేక ఇబ్బందిపడుతున్న అఖిల్ కి మోస్ట్ బ్యాచ్ లర్ రూపంలో విజయం ఇచ్చిన ఘనత పూజా సొంతం. 
 

27

2022తో ఆమెకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. వన్ బై వన్ ప్లాప్స్ ఇచ్చుకుంటూ వచ్చింది. రాధే శ్యామ్ మూవీతో ఆమె సక్సెస్ గ్రాఫ్ పడుతూ వచ్చింది. నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న రాధే శ్యామ్ ప్రభాస్(Prabhas) కెరీర్లో అతిధిగా నష్టాలు మిగిల్చిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. వందల కోట్ల నష్టం రాధే శ్యామ్ మిగిల్చింది. 
 

37

రాధే శ్యామ్ ఫెయిల్యూర్ నుండి బయటపడే లోపే మరో డిజాస్టర్ పలకరించింది. రాధే శ్యామ్ కి మించిన పరాజయం ఆచార్య చవిచూసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిరంజీవి-రామ్ చరణ్(Ram Charan) ల మల్టీస్టారర్ రెండో రోజే థియేటర్స్ నుండి ఎత్తేస్తారు. ఏప్రిల్ లో విడుదలైన ఆచార్య పూజాకు ఊహించని షాక్ ఇచ్చింది.

47

రాధే శ్యామ్, ఆచార్య చిత్రాల మధ్యలో ఆమెకు మరో ప్లాప్ పడింది. విజయ్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ బీస్ట్ ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. రాధే శ్యామ్, ఆచార్యలతో పోల్చుకుంటే నష్టాలు తక్కువే అయినప్పటికీ ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన ప్లాప్ మూవీగా బీస్ట్ రికార్డులకు ఎక్కింది.

57

ఎఫ్ 3లో ఐటెం సాంగ్ చేస్తే అది కమర్షియల్ గా ఫెయిల్. ఓపెనింగ్స్ అందుకున్న ఎఫ్ 3 జోరు చూపలేక నష్టాలు మిగిల్చింది. వీటన్నింటినీ మించిన డిజాస్టర్ సర్కస్ అంటున్నారు. రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన సర్కర్ వరస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది సెంచరీ అని సమాచారం. ఇంటర్వెల్ కే జనాలు థియేటర్స్ నుండి పారిపోతున్నారట.

67
Pooja Hegde

ఎఫ్ 3 తో కూడా కలుపుకుంటే పూజా హెగ్డే ఈ ఏడాది 5 ప్లాప్ లు ఇచ్చారు. ఒక్క దెబ్బకు ఆమె కెరీర్ పాతాళానికి పడింది. ఇప్పుడు పూజాను కాపాడే బాధ్యత ఇక త్రివిక్రమ్ దే. మహేష్(Mahesh Babu) మూవీతో ఆమెకు హిట్ ఇచ్చి సక్సెస్ ట్రాక్ ఎక్కించాలి. ఎస్ఎస్ఎంబి 28 అటూ ఇటు అయితే దుకాణం సర్దుకోవాల్సివస్తుంది. సల్మాన్ తో ఓ మూవీ చేస్తున్నప్పటికీ ఆయన అసలు ఫార్మ్ లో లేడు. బాలీవుడ్ పరిస్థితి అసలేం బాగోలేదు. 
 

77

పూజా కెరీర్ లో 2022 పీడ కలలా మిగిలిపోతుంది అనడంలో సందేహం లేదు. ఈ ఏడాది రెండు భారీ చిత్రాలు సైతం చేజారాయి. విజయ్ దేవరకొండతో మొదలైన జనగణమన మధ్యలో ఆగిపోయింది. భవదీయుడు భగత్ సింగ్ అనుకున్న సమయానికి మొదలైతే పూజాకి ఆఫర్ దక్కేది. మొత్తంగా పూజా ఐరన్ లెగ్ ఆఫ్ ది ఇయర్ గా అవతరించింది.

click me!

Recommended Stories