టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘భవదీయుడు భగత్ సింగ్’లో నటించనున్న పూజా తాజాగా ఊహించని షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
పూజా హెగ్దే (Pooja Hegde) ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ ఏడాది ‘రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య’లో నటించిన విషయం తెలిసిందే. మే27న రిలీజ్ అయిన ‘ఎఫ్3’లోనూ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చి ఆడియెన్స్ ను కట్టిపడేసింది.
26
ప్రస్తుతం హిందీలో మరో రెండు చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది బ్యూటీ. వరుసగా సినిమా ఆఫర్లను బాగానే అందుకుంటోంది. ఈ క్రమంలో తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్న చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’లోనూ అవకాశం దక్కించుకుంది. ఫిబ్రవరిలో మేకర్స్ కూడా పూజానే తమ హీరోయిన్ అని కన్ఫమ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కు జంటగా పూజాను ఊహించుకుంటూ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
36
కానీ ఇంతలో ఊహించని విధంగా పూజా పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. పవన్ నెక్ట్స్ ఫిల్మ్ కు వెళ్లాలన్నా ఈ చిత్రం తర్వాతనే అని తెలుస్తోంది.
46
దీంతో అనివార్యంగా డైరెక్టర్ హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకోవాల్సిన ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. లేట్ కారణంగా పూజా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో పలువురు అభిమానులు అప్సెట్ అవుతున్నారు. ఇదీ నిజమేనా అంటూ కామెంట్లుపెడుతున్నారు.
56
షూటింగ్ ఆలస్యం కారణంగా పూజా సినిమా నుంచి తప్పుకోవడం ఏంటని చర్చించుకుంటున్నారు. కానీ ఇంతలో పూజా హెగ్దే పీఆర్ స్పందిస్తూ ‘ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయితే, అప్పుడు పూజా తప్పకుండా పూజా సినిమాలో ఉంటుంది’ అని వివరణ ఇచ్చాడు. పూజా ఈ మూవీ షూటింగ్ కు హాజరవుతుందో లేదోనని చూడలని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
66
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో Bhavadeeyudu Bhagat singh ఉన్నట్టు తెలుస్తోంది. గత సమచారం ప్రకారం.. ఈ మూవీ వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్ననది. పదేండ్ల తర్వాత డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్ డైరెక్షన్ లో పవన్ సినిమా రాబోతుండటం ప్రేక్షకుల్లో ఎగ్జైట్ పెంచుతోంది. ప్రస్తుతం సినిమా ప్రారంభం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.