లెహంగా చోళీలో మెస్మరైజ్ చేస్తున్న ‘బేబమ్మ’.. మత్తు చూపులతో హార్ట్ బీట్ పెంచేస్తున్న కృతి శెట్టి..

Published : Jun 01, 2022, 01:14 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) లెహంగా, చోళీలో మైమరిపిస్తోంది. క్యూట్ లుక్స్ తో, మెరిసిపోయే అందంతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

PREV
16
లెహంగా చోళీలో మెస్మరైజ్ చేస్తున్న ‘బేబమ్మ’.. మత్తు చూపులతో హార్ట్ బీట్ పెంచేస్తున్న కృతి శెట్టి..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అతి చిన్న మయస్సులో వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటించడం ఆమె కేరీర్ ను తారా స్థాయికి తీసుకెళ్లోంది.
 

26

ప్రస్తుతం కృతి తెలుగులో వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.  మొదటి చిత్రం ‘ఉప్పెన’తోనే  బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బేబమ్మ..  చాలా త్వరగా స్టార్డం తెచ్చుకుంది. ఉప్పెన విజయంలో సింహ భాగం కృతి శెట్టిదే. తన వయసుకు సరిగ్గా సెట్ అయ్యే పాత్రలో  కృతి చాలా సహజంగా నటించింది. 
 

36

దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో వచ్చిన ఉప్పెన భారీ సక్సెస్ ను సాధించడంతో కృతి శెట్టికి వరుసగా సినిమా ఆఫర్లు పడ్డాయి. అందానికి తోడు చక్కటి అభినయం కూడా ఉండటం కృతికి కలిసొచ్చే అంశం. తన చేపకళ్లు, సొట్టబుగ్గలు, రూప సౌందర్యం తెలుగు ఆడియెన్స్ ను కట్టిపడేస్తున్నాయి. 
 

46

ఇక శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) మూవీతో సెకండ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ యంగ్ హీరోయిన్. ఈ మూవీలో ఒకింత హద్దులు దాటి బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించిందీ బ్యూటీ.  నానికి లిప్ లాక్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికీ గురిచేసింది. ఆ తర్వాత తను నటించిన ‘బంగార్రాజు’ కూడా హిట్ కావడంతో కృతి హ్యాట్రిక్ పూర్తి చేసింది. 
 

56

అటు సినిమాల్లో తన మార్క్ చూపిస్తూ... ఇటు సోషల్ మీడియాలను తన పాపులారిటీని పెంచుకుంటోందీ బ్యూటీ. ఇటీవల లేటెస్ట్ ఫొటోషూట్లతో ఆమె అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా లెహంగా చోళీలో బేబమ్మ దర్శనమిచ్చింది. చిలిపిగా నవ్వుతూ, ఓర చూపులతో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 
 

66

ఈ పిక్స్ షేర్ చేస్తూ అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది. ‘మీ హృదయాన్ని సంతోషపెట్టే పని చేయండి’ అంటూ తన అభిమానులకు మేజేస్ ఇచ్చింది. ప్రస్తుతం కృతి ‘ది వారియర్, సూర్య 41, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచెర్ల నియోకవర్గం’ చిత్రాల్లో నటిస్తోంది.

click me!

Recommended Stories