విజయ్ దేవరకొండ-రష్మిక తాము ప్రేమికులమని ఒప్పుకోరు. ఈ వార్తలను అనేక సందర్భాల్లో ఖండించారు. ఫిబ్రవరిలో నిశ్చితార్థం, త్వరలో పెళ్లి అని కథనాలు వెలువడ్డాయి. విజయ్ దేవరకొండ ఖండించారు. మీడియా నాకు ప్రతీసారి పెళ్లి చేస్తూనే ఉంటుంది. నాపై ఇలాంటి పుకార్లు కొత్తేమీ కాదని కొట్టిపారేశారు.