పూజా హెగ్డే కమ్‌ బ్యాక్ మూవీస్‌ లైనప్‌ చూస్తే మతిపోవాల్సిందే.. బౌన్స్ బ్యాక్‌ అంటే ఇలా ఉండాలి!

First Published Mar 23, 2024, 3:12 PM IST

పూజా హెగ్డే దాదాపు రెండేళ్లు సైలెంట్‌ అయ్యింది. ఇప్పుడు అదిరిపోయే కమ్‌ బ్యాక్‌కి రెడీ అవుతుంది. భారీ లైనప్‌తో రాబోతుంది. 
 

బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలుగులో కనిపించి చాలా రోజులవుతుంది. ఆమె చివరగా టాలీవుడ్‌లో `ఆచార్య`, `రాధేశ్యామ్‌` చిత్రాల్లో మెరిసింది. ఆ తర్వాత ఆమె మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. కానీ ఆమె చేయాల్సిన మూడు ఆఫర్లు పోయాయి. రెండు సినిమాల నుంచి తీసేశారు. ఓ మూవీ ఆగిపోయింది. అంతకు ముందు సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. దీంతో తెలుగులో పూజా హెగ్డేకి బ్యాడ్‌ టైమ్‌ స్టార్ట్ అయ్యింది. 

Survey: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

మరోవైపు హిందీలోనూ ఆమె చేసిన సినిమాలు కూడా పరాజయం చెందాయి. అక్కడ కూడా కష్టంగానే మారింది. ఇన్నాళ్లు ఓపికగా ఉన్నా పూజా హెగ్డే.. ఇప్పుడు నెమ్మదిగా అవకాశాలు అందుకుంటుంది. మళ్లీ పుంజుకుంటుంది. వరుసగా బిగ్‌ ప్రాజెక్ట్ లను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇటీవలే తెలుగులోనూ మరో ఆఫర్‌కి సై అన్నట్టు తెలిసింది. 
 

అల్లు అర్జున్‌తో మూడోసారి కలిసి నటించే అవకాశాన్ని అందుకుందట. బన్నీ.. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా పూజాని ఫైనల్‌ చేశారని తెలిసింది. ఇది పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతుంది. దీంతోపాటు బాలీవుడ్‌లోనూ ఆమెకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ మూడు సినిమాలకు సైన్‌ చేసినట్టు సమాచారం. 
 

బాలీవుడ్‌లో పూజా హెగ్డే ప్రస్తుతం `దేవా` చిత్రంలో నటిస్తుంది. షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కుతుంది. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎంపికైంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు కార్తీక్‌ అయాన్‌తో ఓ సినిమా చేస్తుందట. ఇటీవలే దీన్ని సైన్‌ చేసినట్టు సమాచారం. 
 

దీంతోపాటు అహాన్‌ శెట్టితో ఓ సినిమాకి సైన్‌ చేసిందట పూజా హెగ్డే. దీనికి `షంకి` అనే టైటిల్‌ని ఖరారు చేశారట. దీనికి సాజిద్‌ నడియద్‌వాలా రూపొందిస్తున్నారు. ఇలా హిందీలో మూడు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు కలుపుకుని నాలుగు సినిమాల లైనప్‌తో దూసుకుపోతుంది పూజా. వీటితోపాటు తెలుగు, తమిళంలోనూ పలు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయట.
 

మొత్తంగా కమ్‌ బ్యాక్‌ అదిరిపోయేలా చూసుకుంటుంది, తోటి హీరోయిన్లకి మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా చేస్తుందీ బ్యూటీ. అయితే తెలుగు ఆడియెన్స్ కి మాత్రం కాస్త నిరాశే అని చెప్పొచ్చు. ఎందుకంటే వీటిలో ఎక్కువగా బాలీవుడ్‌ సినిమాలే ఉన్నాయి. పూజా రచ్చ అక్కడే ఉండబోతుంది, తెలుగు ఆడియెన్స్ ని కనిపించడానికి చాలా టైమే పడుతుందని చెప్పొచ్చు. 

click me!