Pooja Hegde : అసలు పూజా హెగ్దే నెక్ట్స్ సినిమా ఎప్పుడు? లేటెస్ట్ అప్డేట్ ఇదే!?

Published : Dec 23, 2023, 12:31 PM IST

ఏడాదిన్నరగా తెలుగులో పూజా హెగ్దే  Pooja Hegde నుంచి ఒక్క సినిమాలేదు. దీంతో నెక్ట్స్ సినిమా ఎప్పుడంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బుట్టబొమ్మకు భారీ ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. 

PREV
16
Pooja Hegde : అసలు పూజా హెగ్దే నెక్ట్స్ సినిమా ఎప్పుడు? లేటెస్ట్ అప్డేట్ ఇదే!?

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే సందడి తగ్గింది. Tollywood లో కొన్నేళ్లపాటు ఊపూపిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ప్రస్తుతం ఒక్క సినిమా లేకపోవడం గమనార్హం. పైగా కొత్త సినిమాల ప్రకటనలూ కరువే అయ్యాయి.

26

గతేడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  సరసన ‘రాధేశ్యామ్’లో నటించింది. ఆ చిత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన చిరు ‘ఆచార్య’ కూడా అంతంత మాత్రమే ఆడింది. ఎఫ్3లో కేవలం స్పెషల్ అపీయరెన్స్ తో కట్టిపడేసింది. 

36

ఇక ఈ ఏడాది అసలు తెలుగులో సినిమాలే లేవు. ఏడాదిన్నరగా ఎలాంటి ఆఫర్లు కూడా అందుకోవడం లేదు. కనీసం స్టార్ డైరెక్టర్ (Trivikram)  - మహేశ్ బాబు (Mahesh Babu)  కాంబోలోని గుంటూరు కారం (Guntur Kaaram)లోనైనా అలరిస్తుందనుకుంటే మధ్యలోనే పక్కకు తప్పుకుంది. 

46

అంతకు ముందుకు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రకటించిన ‘జన గణ మన’ క్యాన్సిల్ అయ్యింది. ఇలా వరుస డిజాస్టర్లు, వచ్చిన అవకాశాలూ దూరమయ్యాయి. ఏదేమైనా సరే తదుపరి సినిమా ఎప్పుడంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీనిపై పూజా ఇప్పటి వరకు అప్డేట్ ఇవ్వడం లేదు. 

56

కానీ తాజా సమచారం ప్రకారం..  పూజా హెగ్దేకు లక్కీ ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. అది కూడా తెలుగులో కాదండోయ్... కోలీవుడ్ లో అంట. క్రేజీ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీఏం బ్యానర్ పై ఓ సినిమా రాబోతుందంట. ఆ చిత్రంలో పూజా హెగ్దే పేరు వినిపిస్తోంది.

66

అయితే, ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ అని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్. పూజా హెగ్దేకు ఇందులో నటించబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల ప్రచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉన్నాయి. ఇక తెలుగులో నెక్ట్స్ ఎప్పుడూ సినిమా చేస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది. 

Read more Photos on
click me!

Recommended Stories